శుక్రవారం 27 నవంబర్ 2020
Suryapet - Sep 24, 2020 , 06:40:06

నారాయణ ఈ టెక్నో పాఠశాలకు అనుమతి లేదు : డీఈఓ

నారాయణ ఈ టెక్నో  పాఠశాలకు అనుమతి లేదు  : డీఈఓ

సూర్యాపేట అర్బన్‌ : సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో నారాయణ ఈ టెక్నో పాఠశాల, సిలబస్‌ పేరిట కొన్ని పాఠశాలల యజమాన్యాలు అడ్మిషన్లు తీసుకుంటున్నారని, 2020-21 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు సంబంధించి ఎలాంటి అనుమతి లేదని డీఈఓ మదన్‌మోహన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు గమనించాలని సూచించారు. ఎవరైనా తల్లిదండ్రులు వారి పిల్లలను గుర్తింపు లేని ఆయా పాఠశాలల్లో చేర్పిస్తే వారే బాధ్యత వహించాలన్నారు.