బుధవారం 28 అక్టోబర్ 2020
Suryapet - Sep 22, 2020 , 02:54:03

ప్రజల సహకారంతోనే అభివృద్ధి : ఎమ్మెల్యే బొల్లం

ప్రజల సహకారంతోనే అభివృద్ధి : ఎమ్మెల్యే బొల్లం

 కోదాడ : ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని 23, 31వ వార్డుల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీషతో కలిసి సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కోదాడ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవితారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ వెంపటి పద్మ, కౌన్సిలర్లు పెండెం వెంకటేశ్వర్లు, మెదిరె లలిత, గుండెల సూర్యనారాయణ, సామినేని ప్రమీల, కుక్కడపు బాబు, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వర్‌రావు, పట్టణ మహిళా అధ్యక్షురాలు ఇర్ల రోజారమణి, కో-ఆప్షన్‌ సభ్యులు  పాల్గొన్నారు. 

పశువైద్యశాల నిర్మాణానికి శంకుస్థాపన  

కోదాడ రూరల్‌ : అన్ని గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పాలన సాగుతుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. మండలంలోని నల్లబండగూడెంలో పశువైద్యశాల భవన నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. పాడి, పశు సంపద అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే మండలంలో ఒక్కో పశువైద్యశాల నిర్మాణానికి రూ.18లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవిత, జడ్పీటీసీ మందలపు కృష్ణకుమారి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బాషబోయిన భాస్కర్‌, ఎంపీటీసీ యరమాల క్రాంతి, సర్పంచ్‌ యరమాల సుశీల, ఉపసర్పంచ్‌ కోళ్లూరి రామారావు, కోటేశ్వర్‌రావు, వెంకటేశ్వర్‌రావు,  పశువైద్యుడు నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.  

మత్స్య కార్మికులకు అండగా ప్రభుత్వం.. 

నడిగూడెం : మత్స్య కారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎంపీపీ యాతాకుల జ్యోతి, జడ్పీటీసీ బాణాల కవిత,  వైస్‌ ఎంపీపీ బడేటి వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు నర్సిరెడ్డి, చంద్రయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..  

మోతె : పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. సోమవారం తాసిల్దార్‌ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా 101 చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ  చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ముప్పాని ఆశ, జడ్పీటీసీ పుల్లారావు, తాసిల్దార్‌ యాదగిరి, ఎంపీడీఓ శంకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సైదులు, మల్లారెడ్డి, మల్సూర్‌, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 


logo