బుధవారం 28 అక్టోబర్ 2020
Suryapet - Sep 22, 2020 , 02:54:18

పంచాయతీలకు నిధుల వరద

పంచాయతీలకు నిధుల వరద

  •  సెప్టెంబర్‌ నెల 15వ ఆర్థిక సంఘం  నిధులు విడుదల చేసిన ప్రభుత్వం 
  • సూర్యాపేట  జిల్లాకు రూ. 11.33 కోట్లు 
  •  వారం రోజుల్లో పంచాయతీ  ఖాతాల్లో జమ కానున్న నగదు 

సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధుల కొరత లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. ప్రతినెలా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తూ అభివృద్ధికి సమస్య లేకుండా చేస్తున్నది. ఆగస్టు నెల వరకు ఉన్న నిధులను ఇప్పటికే విడుదల చేయగా ఇప్పుడు  సెప్టెంబర్‌ నెల 15వ ఆర్థిక సం ఘం నిధులను విడుదల చేసింది. వారం రోజుల్లో గ్రామ పంచాయతీల ఖాతాల్లో   ఇవి జమ కానున్నా యి. సూర్యాపేట, నల్లగొండ జిల్లాలోని 1319 గ్రా మ పంచాయతీలకు కలిపి సుమారు రూ. 30 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల్లో జనరల్‌ ఫండ్‌ ఉండగా టైడ్‌ గ్రాంట్‌, ఎస్సీ, ఎస్టీల కాలనీలో అభివృద్ధి కోసం ప్రత్యేకంగా అందించే నిధులను సైతం విడుదల చేశారు. 2011 జనాభా ప్రాతిపదికన గ్రామ పంచాయతీల వారీగా నిధులు అందనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పటికే నిర్దేశించగా వాటికి అనుగుణంగా నిధులను వినియోగించనున్నారు. నల్లగొండ జిల్లాలోని 844 గ్రామ పంచాయతీలకుగాను రూ. 18,34,19,200 నిధులు విడుదలయ్యా యి. వీటిలో జనరల్‌ ఫండ్‌ రూ. 6,99,16,500 ఉండగా వాటికి అదనంగా టైడ్‌ గ్రాంట్‌ రూ. 6,99, 16,500 విడుదల చేశారు. వీటితోపాటు ఎస్టీ ప్రత్యేక నిధులు, టైడ్‌ గ్రాంట్‌ కలిపి రూ. 1,76,74,200 ఎస్సీ ప్రత్యేక నిధులు టైడ్‌ గ్రాంట్‌ నిధులు కలిపి రూ.2,59,12,000 విడుదల చేశారు. సూర్యాపేట జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలకు రూ. 11, 33,08,100 నిధులు విడుదల చేశారు. వీటిలో జనరల్‌ ఫండ్‌ రూ. 4,19,37,250 విడుదల కాగా టైడ్‌ గ్రాంట్‌ సైతం రూ. 4,19,37,250 విడుదలయ్యా యి. ఎస్టీ ప్రత్యేక నిధులు, టైడ్‌ గ్రాంట్‌ కలిపి రూ. 1,10,53,200 ఎస్సీ ప్రత్యేక నిధులు టైడ్‌ గ్రాంట్‌ నిధులు కలిపి రూ. 1,83,80,400 విడుదల చేశారు. జనరల్‌ నిధులు గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నారు. టైడ్‌ గ్రాంట్‌లను ప్రభుత్వం నిర్దేశించిన పథకాల్లో మాత్రమే ఖర్చు చేయాలి. గ్రామ పంచాయతీ పరిపాలన అనుమ   తులు తీసుకొని వాటర్‌, శానిటేషన్‌, విద్యుత్‌ దీపా లు, జీతాలతోపాటు ఇతర గ్రామ పంచాయతీ ఖర్చులకు వినియోగించనున్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధులను గ్రామ పంచాయతీలలో ఉండే ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నారు.

నిధులను సద్వినియోగం చేసుకోవాలి 

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకొని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కువ నిధులు వాటర్‌ సప్లయ్‌, పారిశు ధ్యానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. పల్లె ప్రగతిలో పెండింగ్‌ పనులతోపాటు చేయాల్సిన పనులకు సైతం నిధులను వినియోగించుకోవచ్చు. నిధులను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేసుకోవాలి. గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం వినియోగించాలి. దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకుంటాం. ఈ నెలాఖరులోగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. 


logo