బుధవారం 28 అక్టోబర్ 2020
Suryapet - Sep 21, 2020 , 04:24:53

పట్టభధ్రుల ఓట్లు నమోదు చేయించాలి

పట్టభధ్రుల ఓట్లు నమోదు చేయించాలి

  • టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు దర్గారావు 

పాలకవీడు : పట్టభధ్రుల ఓట్లను నమోదు చేయించాలని టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు  మలమంటి దర్గారావు సూచించారు. ఆదివారం మండల కేంద్రంలో  టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయని, టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రతి గ్రామంలో పట్టభధ్రులకు అవగాహన కల్పించి ఓట్లను నమోదు చేయించాలన్నారు.

కార్యక్రమంలో   టీఆర్‌ఎస్‌ మండల కార్యదర్శి ఎరెడ్ల సత్యనారాయణరెడ్డి, నాయకులు అంజిరెడ్డి, వెంకట్‌రెడ్డి రవినాయక్‌, చినవీరారెడ్డి, భిక్షం, దాదేఖాన్‌, సుబ్బుగౌడ్‌, సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.   


logo