శుక్రవారం 30 అక్టోబర్ 2020
Suryapet - Sep 20, 2020 , 01:13:41

మోడల్‌ జూనియర్‌ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

మోడల్‌ జూనియర్‌ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

మిర్యాలగూడ రూరల్‌ : మండల పరిధిలోని శ్రీనివాస్‌నగర్‌ మోడల్‌ జూనియర్‌ కళాశాలలో ప్రవేశాలకు ఈనెల 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ దీనాసుజాత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ. సీఈసీ, గ్రూప్‌లు ఉన్నాయని, ఒక్కో గ్రూప్‌లో 40 సీట్లు ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులు www.tsmodel schools.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం దరఖాస్తు ఫారాన్ని అక్టోబర్‌ 1లోగా మోడల్‌ స్కూల్‌ కార్యాలయంలో అందజేయాలని కోరారు. అక్టోబర్‌ 5న ఎంపికైన విద్యార్థుల జాబితాను ప్రదర్శిస్తామని, ఒరిజినల్‌ సర్టిఫికెట్లను 7న పరిశీలించడం జరుతుందని పేర్కొన్నారు. 

దేవరకొండ : తెలంగాణ మోడల్‌ జూనియర్‌ కళాశాలల్లో అడ్మిషన్లకు సెప్టెంబర్‌ 30 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్‌ టి.సువర్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన వారి జాబితా  అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.