శుక్రవారం 23 అక్టోబర్ 2020
Suryapet - Sep 20, 2020 , 01:13:39

వ్యక్తిపై హత్యాయత్నం

వ్యక్తిపై హత్యాయత్నం

చింతలపాలెం : మండలంలోని కిష్టాపురంలో వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మట్టయ్య శుక్రవారం అర్ధరాత్రి ఇంటి బయట శబ్ధాలు రావడంతో వచ్చి చూశాడు.

ఈ క్రమంలో గుర్తుతెలియని ముగ్గురు కత్తులతో దాడికి యత్నించారు. గట్టిగా అరవడంతో పారిపోయారు. దాడిలో మట్టయ్య చేతికి స్వల్ప గాయమైంది. శనివారం కోదాడ డీఎస్పీ రఘు, రూరల్‌ సీఐ శివరామిరెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి  తెలుసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.logo