శుక్రవారం 23 అక్టోబర్ 2020
Suryapet - Sep 20, 2020 , 01:13:39

30 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

30 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

గుర్రంపోడు : అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకుని  సప్లయ్‌ అధికారులకు అప్పగించారు.  సప్లయ్‌ డిప్యూటీ  కట్టా వెంకటరంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రేషన్‌ కార్డుదారుల నుంచి 30 క్వింటాళ్ల బియ్యాన్ని సేకరించి బొలేరో  తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో  మండల కేంద్రంలో పోలీసులు దాడి చేసి పట్టుకుని స్టేషన్‌కు తరలించారు.

బియ్యాన్ని తరలిస్తున్న నాంపల్లి మండలానికి చెందిన పూల యాదగిరి, పెద్దాపురం గ్రామానికి  చిర్ర యాదయ్యను అదుపులోకి తీసుకున్నారు.  సప్లయ్‌ అధికారులకు సమాచారం అందించగా..   పంచనామా నిర్వహించారు. ఇదిలాఉండగా, మండల కేంద్రంలోని ఓ రేషన్‌ డీలర్‌ వద్ద నుంచే బియ్యం మొత్తం కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బియ్యం వ్యాపారుల మధ్య  కారణంగానే ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.


logo