ఆదివారం 06 డిసెంబర్ 2020
Suryapet - Sep 20, 2020 , 01:13:36

మునుగోడు నియోజకవర్గ అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

మునుగోడు నియోజకవర్గ అంబులెన్సులను  ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

చండూరు : మున్సిపల్‌, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గానికి రెండు అంబులెన్స్‌లను అందజేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో మంత్రులు కేటీఆర్‌, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి అంబులెన్సులను ప్రారంభించారు. అనంతరం కూసుకుంట్ల మాట్లాడుతూ ఒక అంబులెన్స్‌ను చండూరు, మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి మండలాలకు, మరొకటి సంస్థాన్‌నారాయణపురం, చౌటుప్పల్‌ మండలాలకు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, మర్రిగూడ ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.