గురువారం 26 నవంబర్ 2020
Suryapet - Sep 19, 2020 , 05:08:13

నీటి సంపులో పడి బాలిక మృతి

నీటి సంపులో పడి బాలిక మృతి

సూర్యాపేట రూరల్‌ : మండలంలోని జాటోతుతండా ఆవాస గ్రామం బుంగ్యాతండాలో బాలిక ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన వాంకుడోతు నాగు, జ్యోతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కాగా, చిన్న కుమార్తె మోను(5)  సాయంత్రం ఆడుకునేందుకు బయటకు వెళ్లి ఇంటికొచ్చింది. నీటి సంపు వద్ద  కడుగుతుండగా  సంపులో  అందుకునే క్రమంలో   పడింది. ఎవరూ గమనించకపోవడంతో బాలిక  మోను ఎంతసేపటికీ  రాకపోవడంతో తల్లి జ్యోతి చుట్టుపక్కల  అడిగింది. చాలా  క్రితమే ఇంటికి వెళ్లిందని చిన్నారులు చెప్పగా.. కంగారుతో  చూసేసరికి మోను శవమై తేలింది. దీంతో తల్లితండ్రుల రోదనలు మిన్నంటాయి. బాధితులను  జాటోతు హేమలత, ఇమాంపేట ఎంపీటీసీ మామిడి కిరణ్‌ పరామర్శించారు.