ఆదివారం 29 నవంబర్ 2020
Suryapet - Sep 19, 2020 , 05:08:13

దొంగ‌ల‌పై ప్రత్యేక న‌జ‌ర్‌

దొంగ‌ల‌పై ప్రత్యేక న‌జ‌ర్‌

  • సాంకేతికత ఆధారంగా కేసుల చేధన 
  • మూడేళ్లలో 418మంది అరెస్టు
  • రూ.3.59  సొత్తు స్వాధీనం
  • 79 మంది దొంగలకు జైలు శిక్ష

సూర్యాపేట సిటీ : 65వ జాతీయ రహదారి తెలుగు రాష్ర్టాలకు ముఖ ద్వారంగా ఉన్నది.  ఆంధ్రా సరిహద్దు కలిగి ఉన్న ఈ మార్గంలో  ప్రజల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో అంతర్రాష్ట్ర, అంతర్‌ జిల్లా దొంగల ముఠాలు ఎక్కువగా సంచరిస్తుంటాయి.

దీంతో  దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయి. కాగా, దొంగలపై ప్రత్యేక నజర్‌ పెట్టిన సూర్యాపేట జిల్లా పోలీసులు సాంకేతికత ఆధారంగా కేసులను చేధిస్తున్నారు.  ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌, నెట్‌వర్కింగ్‌ సిస్టం, ఫేస్‌ రీడింగ్‌ స్కానర్‌, ఈ-బీట్స్‌ పెట్రోలింగ్‌, జైల్‌ రిలీజింగ్‌ మానిటరింగ్‌ సిస్టం వంటి టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగిస్తున్నారు. పాత నేరస్తులు, దొంగల  వేలిముద్రలు, ఇతర వివరాలను  చేసిన పోలీసు సీక్రేట్‌ డేటాను బాగా  దొంగల ఆట కట్టిస్తున్నారు. ఖైతస్థాయిలో వనరులను ఉపయోగించుకుంటూ అంతర్రాష్ట్ర, అంతర్‌ జిల్లా దొంగలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పోయిన సొత్తును స్వాధీనం చేసుకుంటున్నారు.

గత  418 మంది దొంగలను పట్టుకుని రూ.3.59కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 79 మంది నిందితులకు జైలు శిక్ష పడేలాచేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ పోలీసు తనిఖీలు, గస్తీ నిర్వహిస్తుంన్నారు. ఈ సమయంలో ఎవరైనా కొత్త వ్యక్తులు, అనుమానితులు తారసపడితే ఫింగర్‌ ప్రింట్‌, ఫేస్‌ రీడింగ్‌ స్కానర్‌తో పరిశీలిస్తారు. అతనికి నేర చరిత్ర ఉంటే దీని ఆధారంగా వెంటనే తెలుస్తుంది. అదుపులోకి తీసుకుని విచారించి కేసులను చేధిస్తున్నారు. 

జిల్లా పోలీసులు చేధించిన కేసులు.. 

సంవత్సరం నమోదైన కేసులు   చేధించినవి    చోరీ సొత్తు          స్వాధీనం సొత్తు   అరెస్టయినవారు    పడ్డవారు 

2018 218   201         రూ.2.05కోట్లు        197                      42

2019 198   145         రూ.1.85కోట్లు    రూ.1.36కోట్లు    154                      26

2020 102   75           రూ.70లక్షలు      రూ.44లక్షలు      67                        11

పూర్తి రక్షణ కల్పిస్తున్నాం 

దొంగతనాలు జరుగకుండా ప్రజలు, ప్రభుత్వ ఆస్తులకు మా వంతుగా పూర్తి రక్షణ కల్పిస్తున్నాం. దోపిడీ కేసుల చేధనకు జిల్లా పోలీసులు కృషి చేస్తున్నారు. కేసుల దర్యాప్తులో  ఉన్న సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 105మంది   పాల్పడుతున్నట్లు గుర్తించాం. వారిపై ప్రత్యేక దృష్టి సారించాం. దొంగతనం కేసుల్లో పలుమార్లు అరెస్టయిన నేరస్తులను బైండోవర్‌ చేస్తున్నాం. ఎక్కువ మొత్తంలో సొత్తును స్వాధీనం చేసుకుంటున్నాం. రికవరీ రేటు బాగా పెరిగింది. 

- ఆర్‌.భాస్కరన్‌   ఎస్పీ