ఆదివారం 25 అక్టోబర్ 2020
Suryapet - Sep 19, 2020 , 02:20:58

భూమి రిజిస్ట్రేషన్‌ చేయడం లేదని విద్యుత్‌ టవర్‌ ఎక్కిన రైతు

భూమి రిజిస్ట్రేషన్‌ చేయడం లేదని విద్యుత్‌ టవర్‌ ఎక్కిన రైతు

తిరుమలగిరి : తనకు భూమిని విక్రయించిన  రిజిస్ట్రేషన్‌ చేయడం లేదని ఓ రైతు విద్యుత్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామస్తులు, పోలీసులు నచ్చజెప్పి కిందికి దింపారు. ఈ సంఘటన మండలంలోని తొండ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి..  గ్రామానికి చెందిన రైతు ఎల్లంల బాలరాజు అదే గ్రామానికి చెందిన నాగులగాని రామారావు, బాబూరావు సోదరుల వద్ద మూడు  క్రితం రూ.10లక్షలు చెల్లించి రెండెకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. కొనుగోలు కాగితాలు ఉన్నప్పటికీ  పట్టా చేయకుండా  విక్రయదారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలోనే  భూమిలో తనకు సైతం వాటా ఉందని విక్రయించిన వారి చెల్లెలు కోర్టు నుంచి నోటీసులు పంపించింది. దీంతో  చెందిన రైతు బాలరాజు శుక్రవారం విద్యుత్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామస్తులు, పోలీసులు నచ్చజెప్పి కిందికి దించారు.



logo