శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Sep 17, 2020 , 00:56:21

పోషకాహారంతోనే ఆరోగ్య సమాజం: కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

పోషకాహారంతోనే ఆరోగ్య సమాజం:   కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

సూర్యాపేట : గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులకు మెరుగైన పోషకాహారం అందించినప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణమాసం, పోషణ్‌ అభియాన్‌ కన్వర్జెన్స్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు బాలికల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో బాల్య వివాహాలు చేసుకున్న వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని ఐసీడీఎస్‌ అధికారులను ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి మహిళా, శిశు సంక్షేమ, వయో వృద్ధుల దివ్యాంగులశాఖ ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అధికారులు, సిబ్బందితో పోషణ్‌ అభియాన్‌ మాసోత్సవం ప్రతిజ్ఞ చేయించి పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో మహిళా శిశు, దివ్యాంగుల వయో వృద్ధుల జిల్లా సంక్షేమాధికారి నరసింహారావు, ఆర్డీఓలు రాజేంద్రకుమార్‌, కిశోర్‌కుమార్‌, వెంకీరెడ్డి, జడ్పీటీసీలు జీడి భిక్షం, పుల్లారావు, దావుల వీరప్రసాద్‌, పోషణ్‌ అభియాన్‌ జిల్లా కో-ఆర్డినేటర్‌ సంపత్‌, ప్రాజెక్టు అధికారులు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.


logo