మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Sep 17, 2020 , 00:56:21

రైతువేదికలు సకాలంలో పూర్తి చేయాలి

రైతువేదికలు సకాలంలో పూర్తి చేయాలి

  • గ్రామీణాభివృద్ధిశాఖ సంయుక్త కమిషనర్‌ డాక్టర్‌ జగత్‌కుమార్‌రెడ్డి

సూర్యాపేట : జిల్లాలో రైతువేదికలు, పల్లె ప్రకృతి వనాలను సకాలంలో పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ధిశాఖ సంయుక్త కమిషనర్‌ డాక్టర్‌ జగత్‌కుమార్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలో చేపట్టిన రైతువేదికల నిర్మాణ పనులను, పల్లె ప్రకృతి వనాలపై వ్యవసాయశాఖ అధికారులు, పంచాయతీరాజ్‌ ఇంజినీర్లతో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డితో కలిసి మాట్లాడారు. సంబంధితశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రైతువేదికలను సమయానికి పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇంజినీర్ల పాత్ర చాలా కీలకమని క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని ఆదేశించారు. అక్టోబర్‌ 10నాటికి అన్ని రైతువేదికలు ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం జిల్లాలో ఏర్పాటు చేసిన 436 పల్లె ప్రకృతి వనాలపై కలెక్టర్‌తో కలిసి సమీక్షించారు. కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే అన్ని క్లస్టర్లలో రైతువేదికల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మద్దిరాల, మఠంపల్లిలో పూర్తి అయ్యాయని మరో 30 ఈనెలాఖరుకు పూర్తి అవుతాయన్నారు.  సమావేశంలో పీడీ కిరణ్‌కుమార్‌, ఏడీఏ జ్యోతిర్మయి, అదనపు పీడీ సురేశ్‌, డాక్టర్‌ పెంటయ్య, పీఆర్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్లు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు. logo