శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Sep 17, 2020 , 00:22:34

సేవలకు సెల్యూట్‌...

సేవలకు సెల్యూట్‌...

వరద పోటెత్తుతున్నా.. వాగు దాటుకుని వెళ్తున్న ఈ మహిళ మునగాల మండలం రేపాల పీహెచ్‌సీ సెకెండ్‌ ఏఎన్‌ఎం సంగెపు సుచరిత. బుధవారం ఉదయం తాడ్వాయి గ్రామంలో గర్భిణులు, పసిపిల్లలకు టీకాలు వేసే సమయం రావడంతో దారి మధ్యలో అడ్డొచ్చిన ప్రవాహాన్ని లెక్కచేయకుండా నీళ్లలో నడుచుకుంటూ వెళ్లింది.

ఈసందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ఆమెను పలుకరించగా ‘టీకాలతో పాటు కొవిడ్‌ బాధితులకు, టీబీ వ్యాధిగ్రస్తులకు మందులు కూడా అందించాల్సిన బాధ్యత నాపై ఉన్నది.. వ్యవసాయ కుటుంబంలో పెరిగిన నాకు నీళ్లంటే భయం లేదు. నేను వెళ్లకపోతే చాలా మంది అనారోగ్యంతో ఇబ్బంది పడుతారు’ అంటూ సమాధానమిచ్చింది. సుచరితను గ్రామస్తులు అభినందనలతో ముంచెత్తారు.  

 - మునగాల


logo