మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Suryapet - Sep 16, 2020 , 02:50:57

అన్నదాతకు మరింత మద్దతు

అన్నదాతకు మరింత మద్దతు

  • పంట మద్దతు ధర పెంచిన కేంద్రం  
  • ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోళ్లు
  • వానకాలం సాగు నుంచే అమలు

వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తూ.. రైతులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుండగా.. పంట ఉత్పత్తుల మద్దతు ధరను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులకు మరింత ప్రయోజనం కలుగనుంది. పెంచిన ధరలు వానకాలం నుంచే అమలు కానున్నాయి.  

రైతులు పండించే పంటలకు అవుతున్న ఖర్చు..మార్కెటింగ్‌ వ్యయాన్ని అంచనా వేస్తూ.. కేంద్రం రైతుల పంట ఉత్పత్తులకు మద్దతు ధరను నిర్ణయిస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం వానకాలం, యాసంగికి సంబంధించిన మద్దతు ధరను కేంద్రం పెంచింది. ఆయా కాలాల పంట ఉత్పత్తులను ఎఫ్‌సీఐ, మార్క్‌ఫెడ్‌, సీసీఐతో పాటు మార్కెటింగ్‌ శాఖ సిబ్బంది కూడా కొనుగోలు చేయనున్నారు.  

పంటల మద్దతు ధర ఇలా..

ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో నియంత్రిత సాగు చేపట్టిన రైతులకు మార్కెట్లో అధిక ధరలు లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు కేంద్రం మద్దతు ధర పెంచడంతో మరింత ప్రయోజనం కలుగనుంది. గతేడాది కన్నా ఈ సారి వరికి రూ.53, జొన్న రూ.70, సజ్జలకు రూ.150, కందులకు రూ.200, వేరుశనగ రూ.185, పత్తికిలో ఒక రకానికి రూ.260, మరో రకానికి రూ.275 చొప్పున కేంద్రం పెంచింది.

సమృద్ధిగా సాగు

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మూసీ, కృష్ణా, గోదావరి జలాలు పుష్కలంగా రావడంతో పాటు సకాలంలో వర్షాలు కురవడంతో సాగు అధికమైంది. ఎక్కువగా వరి, పత్తి, కంది, పెసర, మిరప, వేరుశనగ పంటలను రైతులు సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా 74,895 ఎకరాలలో వరి, 41,515 ఎకరాలలో పత్తి, 4,033 ఎకరాలలో కంది, 2849 ఎకరాలలో పెసర, 811 ఎకరాలలో వేరుశనగ, 24 ఎకరాలలో మొక్కజొన్న, 23 ఎకరాలలో సజ్జలు, సాగు చేస్తున్నారు. మొత్తం మీద జిల్లాలో వానకాలంలో 1,24,150 ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి.  

ప్రభుత్వ నిర్ణయం మేరకు మద్దతు ధరలు

మద్దతు ధరలను పెంచడం వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. పంటల సాగుకు పెట్టుబడి పెరుగుతుండడంతో కేంద్రం కూడా మద్దతు ధరలను పెం

చేందుకు నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లాలో అధిక మొత్తంలో పత్తి, వేరుశనగ, వరి సాగు చేస్తున్న రైతులకు ప్రయోజనం చేకూరనుంది. దీంతో పాటు ఈసారి మార్కెటింగ్‌ శాఖ ద్వారా కూడా పంట ఉత్పత్తులు కొనుగోలు చేయనున్నాం.  

- మహ్మద్‌ అబ్దుల్‌ అలీమ్‌, 

జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి, నల్లగొండ logo