శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Sep 16, 2020 , 02:50:54

నేటి నుంచి డిగ్రీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు

నేటి నుంచి డిగ్రీ  చివరి సెమిస్టర్‌ పరీక్షలు

  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 68 కేంద్రాల్లో సర్వం సిద్ధం
  • కొవిడ్‌ పాజిటివ్‌ ఉంటే తగ్గిన తర్వాతే పరీక్షలు 

నల్లగొండ విద్యావిభాగం: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడిన డిగ్రీ వివిధ కోర్సుల ఫైనల్‌ ఇయర్‌ చివరి సెమిస్టర్‌ పరీక్షలు కొవిడ్‌  నిబంధనలతో బుధవారం ప్రారంభం కానున్నా యి. మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉ మ్మడి జిల్లా వ్యాప్తంగా కళాశాల యాజమాన్యాలు అందుకు ఏర్పాట్లు చేశారు. ఉన్నత విద్యామండలి ఆదేశాలతో ఈ పర్యాయం సెల్ఫ్‌ సెంటర్స్‌( విద్యార్థులు చదివిన కళాశాల)లో పరీక్షలు రాసే అవకాశం కల్పించారు. కొవిడ్‌ పాజిటివ్‌, ఐసొలేషన్‌లో ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని పరీక్షల నియంత్రణాధికారి డా. మిర్యాల రమేశ్‌కుమార్‌ తెలిపారు. అందుకు సంబంధించి వివరాలను ఆయా కళాశాల ప్రిన్సిపాళ్లకు విద్యార్థులు పూర్తి ఆధారాలతో సమర్పించాలని కోరారు.  

పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు...

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పూర్తి రక్షణ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలోని 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన కళాశాలల్లో  సోడియం హైపో క్లోరైట్‌తో తరగతి గదులను శానిటైజర్‌ చేసి హాల్‌టికెట్‌ నెంబర్లు వేశారు. ఇన్విజిలేటర్లగా మాస్కులు, ఫేస్‌షీట్స్‌, చేతి గ్లౌజ్‌లు ఇస్తున్నారు.  విద్యార్థులను థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి చేతు ల శానిటైజేషన్‌ తర్వాతనే అనుమతిస్తారు. 


logo