గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Sep 16, 2020 , 02:51:03

ప్రమాదాల నివారణకు చర్యలు సీఐ

ప్రమాదాల నివారణకు చర్యలు  సీఐ

సూర్యాపేట  : ట్రాఫిక్‌ నియంత్రణకు, ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నామని పట్టణ సీఐ ఆంజనేయులు తెలిపారు. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణలో భాగంగా ఎస్వీ ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద పట్టణంలోకి వచ్చే రోడ్డు మార్గాన్ని (మీడియం ఓపెనింగ్‌)   పాంతం బ్లాక్‌ స్పాట్‌గా ఉన్నందున ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం మూసివేసినట్లు తెలిపారు. ఈ మేరకు జాతీయ రహదారుల నిర్వహణ సంస్థకు లేఖను పంపించామన్నారు. పట్టణంలోకి వచ్చి పోయేవారు ఈ మార్గానికి బదులుగా జనగాం రోడ్డును వినియోగించుకోవాలని సూచించారు.


logo