బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Sep 15, 2020 , 06:47:49

చంద్రయ్య మృతదేహం కోసం గాలింపు

చంద్రయ్య మృతదేహం కోసం గాలింపు

తుంగతుర్తి : మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన వీరబోయిన చంద్రయ్య ఆదివారం ఉదయం అన్నారం-కేశవాపురం గ్రామ సమీపంలో వాగులో పడి  కొట్టుకుపోయాడు. దీంతో ఆదివారం సా యం త్రం వరకు గాలించినా మృతదేహం లభ్యం కాకపోవడంతో సోమవారం స్థానిక సీఐ రవికుమార్‌ ఆధ్వర్యంలో గుంటూరుకు చెందిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ బృందం నేతృత్వంలో ప్రత్యేక బోటును తయారు చేసుకొని వాగులోకి దిగి సాయంత్రం వరకు గాలించారు. అయినా మృతదేహం లభ్యం కాలేదు. ఉదయం నుంచి సా యంత్రం వరకు సంగెం, అన్నారం, కేశవాపురం పరీవాహక ప్రాంతాల్లో గాలించినా మృతదేహం లభ్యం కాకపోవడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. కార్యక్రమంలో తాసిల్దార్‌ పుష్ప, ఎంపీపీ గుండగాని కవిత, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పులుసు యాదగిరిగౌడ్‌, ఎన్‌ఆర్‌ఆర్‌డీఎఫ్‌ ప్రత్యేక బృందం పాల్గొన్నారు. logo