గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Sep 11, 2020 , 02:03:30

జిల్లా వార్షిక ప్రణాళిక 3,448.18కోట్లు

జిల్లా వార్షిక ప్రణాళిక 3,448.18కోట్లు

  •   సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

బొడ్రాయిబజార్‌ : 2020-21 సంవత్సరానికి సూర్యాపేట జిల్లా వార్షిక రుణ ప్రణాళికను రూ. 3,448.18 కోట్లతో కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి విడుదల చేశారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గురువారం  బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులు, జిల్లా సంప్రదింపుల కమిటీ(డీసీసీ), డీఎల్‌ఆర్సీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి ప్రతి శాఖ బాధ్యతగా పనిచేస్తూ ముందుకు సాగాలని సూచించారు.

రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలకు రూ.3,163.26 కోట్లు కేటాయించగా ఇందు లో పంట రుణాలకు 2010.26 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2,607.06 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.633.26 కోట్లు (ఎంఎస్‌ఎంఈ రూ. 326.78 కోట్లు, విద్య రుణాలకు రూ.32.60 కోట్లు, గృహ రుణాలకు రూ.44.46 కోట్లు, మిస్లినియస్‌ రుణాలకు రూ.229.42 కోట్లు) జిల్లాలోని రూ.12,958 స్వయం సహాయక బృందాలకురూ.347.39కోట్ల బ్యాంకు రుణాలు అందించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. అర్హులైన వీధి వర్తకులందరికీ రుణాలు వెంటనే మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు.

జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా 5,272 మంది లబ్ధ్దిదారులకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు పంపగా 3,527మందికి రుణాలు మంజూరైనట్లు మిగతా వారికి వెంటనే    మంజూరు చేయాలని ఆదేశించారు. అలాగే ఎస్సీ,బీసీ కార్పొరేషన్లు, పశు సంవర్ధ్ధక, మత్స్యశాఖ, ఐకేపీ లబ్ధిదారులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ పద్మజారాణి, డీఆర్‌డీఓ కిరణ్‌కుమార్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ జగదీశ్‌చంద్రబోస్‌, ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ నారాయణ, డీఏఓ జ్యోతిర్మయి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్‌ వేణుమనోహర్‌, జిల్లా పరిశ్రమల అధికారి తిరుపతి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శిరీష, మైనార్టీ సంక్షేమశాఖ ఈడీ శ్రీనివాస్‌, మత్స్యశాఖ అధికారి జిల్లా  సౌజన్య, బీసీ సంక్షేమాధికారి జ్యోతి    తదితరులు పాల్గొన్నారు. logo