ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Sep 11, 2020 , 02:03:27

కేసీఆర్‌ యుగ పురుషుడు

కేసీఆర్‌ యుగ పురుషుడు

  •  పంచామృతాభిషేకం చేసిన 90ఏళ్ల వృద్ధురాలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం        భూ మాఫియాకు ఉరితాడు వంటిదని హుజూర్‌నగర్‌కు చెందిన తొంభై ఏళ్ల వృద్ధురాలు అమరవాది లక్ష్మీనర్సమ్మ అన్నారు. కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుడిని కోరుకుంటూ గురువారం తన నివాసంలో సీఎం చిత్రపటానికి పంచామృతంతో అభిషేకం చేశారు. నిరుపేదలు, నిస్సహాయుల కష్టనష్టాలు అర్థం చేసుకుని పరిపాలన కొనసాగిస్తున్న కేసీఆర్‌ యుగ పురుషుడు అని ఆమె అభిప్రాయపడ్డారు. నిరుపేదల భూములు గుంజుకొని ఇబ్బందులు పెడుతున్న వారిని  కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆమె   ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.


logo