ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Sep 10, 2020 , 03:29:33

అనర్హులను వైద్యులుగా నియమిస్తే చర్యలు

అనర్హులను వైద్యులుగా నియమిస్తే చర్యలు

  •  డీఎంహెచ్‌ఓ హర్షవర్ధన్‌
  •  ‘పేట’లో పలు ్ర పైవేట్‌ దవాఖానలు, ల్యాబ్‌లు, ఫిజియోథెరపీ సెంటర్లలో   ఆకస్మిక తనిఖీ

సూర్యాపేట టౌన్‌: ప్రైవేటు దవాఖాన, ల్యాబ్‌, ఫిజియోథెరపీ నిర్వాహకులు అర్హత లేని వైద్యులు, సిబ్బందిని నియమించుకుంటే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ హర్షవర్ధన్‌ హెచ్చరించారు. కరోనా నియంత్రణ, ప్రైవేట్‌ దవాఖానలు అందిస్తున్న సేవల పర్యవేక్షణలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్‌ దవాఖానలు, ల్యాబ్‌లు, ఫిజియోథెరపీ కేంద్రాలను  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ప్రైవేట్‌ దవాఖానల్లో అనుమతి లేకుండా కరోనా పరీక్షలు, చికిత్స చేయొద్దని సూచించారు. అన్ని దవాఖానల వార్డుల్లో శానిటేషన్‌ నిర్వహణ ప్రమాణాల ప్రకారం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అర్హత లేకున్నా విజిటింగ్‌ కార్డులు, లెటర్‌ ప్యాడ్‌లపై పేర్లు  రాసుకున్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా పరీక్షలు కేవలం ప్రభుత్వ దవాఖాన, ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే చేస్తున్నారన్నారు. ప్రైవేటు దవాఖానలకు అనుమతి లేదన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం మేనేజర్‌ భాస్కర్‌రాజు,  తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.       


logo