గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Sep 10, 2020 , 03:29:35

సిగ్నల్‌ కోసం గుట్టెక్కాల్సిందే..

సిగ్నల్‌ కోసం గుట్టెక్కాల్సిందే..

  •  ఆన్‌లైన్‌ పాఠాలు వినేందుకు గ్రామీణ ప్రాంత విద్యార్థుల అవస్థలు

చందంపేట : మండలంలోని మారుమూల ప్రాంతాల్లో సెల్‌ సిగ్నల్స్‌ లేక పోవడంతో ఆన్‌లైన్‌ క్లాసులు వినేందుకు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మండలంలోని రేకులగడ్డ, యాపలపాయ తండా, బుడ్డోని తండా, చిత్రియాల, పెద్దమూల, ఉస్మాన్‌ కుంట తదితర గ్రామాల విద్యార్థులు నల్లగొండ, దేవరకొండ, హైదరాబాద్‌ నగరాల్లోని కళాశాలల్లో చదువుకుంటున్నారు.

ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో కళాశాలలు, పాఠశాలలు తెరుచుకోక పోవడంతో ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నారు. ఆయా తండాల్లో సెల్‌ సిగ్నల్స్‌ లేక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సమీపంలోని గుట్టల పైకెక్కి సిగ్నల్‌ ఉన్న ప్రాంతానికి వెళ్లి ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్నారు. ఇంకొంత మంది విద్యార్థుల ఇళ్లల్లో టీవీలు లేక పోవడంతో సెల్‌లోనే పాఠాలు వినాల్సి వస్తోంది.


logo