బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Sep 07, 2020 , 02:28:39

ఆక్సిజన్‌ అందక మృతి

ఆక్సిజన్‌ అందక  మృతి

  •  పైపు ఊడినా గుర్తించని అంబులెన్స్‌ సిబ్బంది 
  •  దవాఖాన  కుటుంబ సభ్యుల ఆందోళన

మిర్యాలగూడ టౌన్‌ : ఆక్సిజన్‌ అందక  శిశువు మృతిచెందాడు.  వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.  సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..  మండలం అభంగాపురం గ్రామానికి చెందిన చింతమళ్ల శివ భార్య స్పందన పురిటినొప్పులతో శనివారం సాయంత్రం మిర్యాలగూడలోని జ్యోతి దవాఖానలో చేరింది. వైద్య పరీక్షల్లో ఉమ్మ నీరు లేదని గుర్తించిన డాక్టర్‌  శస్త్రచికిత్స చేయగా  జన్మించాడు. శిశువు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండగా.. కొద్ది రోజులపాటు వెంటిలేటర్‌పై ఉంచి ఆక్సిజన్‌ అందించాలని  సూచించారు. దీంతో ఆదివారం తెల్లవారుజామున దవాఖాన  ఉన్న ఆక్సిజన్‌ సిలిండర్‌ ద్వారా  అందిస్తూ హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నారు.   అచేతనంగా పడిపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి శివ ఆక్సిజన్‌ సిలిండర్‌ పైపు ఊడి ఉండటాన్ని గుర్తించాడు. వెంటనే నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా.. ఆక్సిజన్‌ అందక శిశువు మృతిచెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు.  పైపు అమర్చడంలో అంబులెన్స్‌ సిబ్బంది నిర్లక్ష్యం వహించినందునే శిశువు ప్రాణం పోయిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు జ్యోతి దవాఖాన ఎదుట ఆందోళన చేశారు.  తెలుసుకున్న టూ టౌన్‌ సీఐ శ్రీనివాస్‌రెడ్డి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

శిశువు తల్లి స్పందనకు ఉమ్మ నీరు లేనందున శస్త్రచికిత్స చేసి పురుడు పోశామని దవాఖాన  డాక్టర్‌ జ్యోతి పేర్కొన్నారు.  ఉన్నప్పుడు మట్టు తిన్నందునే శిశువు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి మెరుగైన  కోసం హైదరాబాద్‌కు తరలించామని చెప్పారు.  వరకు అంబులెన్స్‌లో ఉన్న ఆక్సిజన్‌ సిలిండర్‌తో కృత్రిమ శ్వాస అందించాలని సిబ్బందికి సూచించినట్లు తెలిపారు. logo