గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Sep 06, 2020 , 00:03:49

చంద్రబాబు వాహనశ్రేణికి ప్రమాదం

చంద్రబాబు వాహనశ్రేణికి ప్రమాదం

చౌటుప్పల్‌ రూరల్‌ : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వాహనశ్రేణికి శనివారం ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండు మల్కాపురం 65వ జాతీయ రహదారిపై ఆవు అడ్డు రావడంతో ముందున్న పైలట్‌ వాహనానికి డ్రైవర్‌ ఒక్కసారిగా సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో వెనుక వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. తర్వాత వాహనంలోనే చంద్రబాబు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదంతో భద్రతా సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. తిరిగి యథావిధిగా వాహనశ్రేణి హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. 

ట్రాక్టర్‌ బోల్తా : ముగ్గురికి గాయాలు

త్రిపురారం : ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గురికి గాయాలైన సంఘటన శుక్రవారం రాత్రి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... త్రిపురారం మండలం రాగడప నుంచి మిర్యాలగూడ మండలం లావూడితండాకు మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపు తప్పి రాగడప గ్రామంలోని కనకదుర్గమ్మ ఆలయం వద్ద ప్రమాదవశాత్తు పల్టీ కొట్టి ఆటోపై పడింది. దీంతో ఆటోలో ఉన్న పులి అఖిల్‌, నల్లపురాజు సైదులు, జిల్లేపల్లి సంజీవ్‌కు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామ్మూర్తి తెలిపారు. 


logo