గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Sep 05, 2020 , 00:52:52

కంచర్ల కుటుంబానికి మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ

కంచర్ల కుటుంబానికి  మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ

చిట్యాల : నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు, టీఆర్‌ఎస్‌ నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి కూతురు మానస ఈనెల 3న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కంచర్ల సోదరుల స్వగ్రామమైన ఉరుమడ్లకు వెళ్లి వారిని పరామర్శించారు.

వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కంచర్ల సోదరులను పరామర్శించారు. మంత్రి వెంట నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీపీ కొలను సునీతావెంకటేశం, సింగిల్‌విండో చైర్మన్‌ సుంకరి మల్లేశ్‌గౌడ్‌, నల్లగొండ మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి తదితరులు ఉన్నారు. logo