ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Suryapet - Sep 04, 2020 , 07:32:57

మిద్దెపంటతో.. ఆరోగ్యం

మిద్దెపంటతో.. ఆరోగ్యం

  •  చీడపీడల నివారణకు సేంద్రియ ఎరువుల వాడకం
  • 2000 చ.అ మిద్దెపై 200 రకాల మొక్కల పెంపకం
  • గృహిణులకు ప్రేరణగా నిలుస్తున్న ప్రకృతి ప్రేమికురాలు నల్లపాటి మమత

సూర్యాపేట అర్బన్‌ : సాధారణంగా ఇంట్లో మిద్దె(టెర్రస్‌) ఉంటే వ్యాయమం కోసమే లేదా స్టోర్‌ రూం ఏర్పాటుకో వాడతారు. కానీ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లలబావి సమీపంలో నల్లపాటి శ్రీధర్‌కు చెందిన ఇల్లు నందనవనంలా కన్పిస్తుంది. ఇంటి టెర్రస్‌(మిద్దె)పై ఆయన సతీమణి నల్లపాటి మమత పెంచుతున్న మొక్కలు ప్రకృతి ప్రేమికులను మైమరపిస్తున్నాయి. హరితహారంలో భాగంగా ప్రభుత్వం సబ్సిడీ కింద  ఇచ్చిన కిట్లు తనలో ఆసక్తిని మరింత పెంచాయని ఆమె చెబుతున్నారు. దాదాపు 2000 చదరపు అడుగుల స్థలంలో తొట్లలో మట్టిని నింపి కూరగాయలు, ఆకుకూరలు, పూలు, ఔషధ మొక్కలను పెంచుతున్నారు. ఇంటిలోని కిచెన్‌(వంటగది) వ్యర్థాలతో సేంద్రియ ఎరువును తయారు చేసి మొక్కలపై పిచికారీ చేస్తూ ఆరోగ్యకరమైన పంటలను పండిస్తున్నారు.

డ్రిప్‌తో నీటి సరఫరా...

మిద్దెపై దాదాపు 200 మొక్కలకు డ్రిప్‌ సిస్టం ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. బోన్సాయ్‌, కొత్త రకం ద్రాక్ష మొక్కలు కూడా పెంచుతున్నారు. రోజూ 2 గంటలు మొక్కల సంరక్షణకు  కేటాయిస్తూ గృహిణులకు ప్రేరణగా నిలుస్తున్నారు ప్రకృతి ప్రేమికురాలు మమత. 

పెంచుతున్న చేస్తున్న మొక్కలు...

ఆకు కూరలు : పాలకూర, చుక్క కూర, తోటకూర, చెన్నంగి ఆకు.

కూరగాయలు : చిక్కుడు, గోరు చిక్కుడు, బెండ, సోరకాయ, దొండకాయ.

పూలు : గులాబీ, లిల్లీ, చామంతి,...

దుంపకూరలు : ఆలుగడ్డ, చామగడ్డ, బీట్‌రూట్‌

ఔషధ మొక్కలు : తులసి, వాము, కలబంద, పుదీనా, గోదుమ గడ్డి


logo