మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Sep 02, 2020 , 02:47:25

బోడ కాకరకాయలో.. బోలెడు పోషకాలు

బోడ కాకరకాయలో.. బోలెడు పోషకాలు

రుచికి కొంచెం చేదైనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేది బోడకాకర కాయ. ఇవి అడవుల్లో ఎక్కువగా కాస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిలో అనేక పోషకాలు ఉండడంతో మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు ఇవి లభిస్తుంటాయి.  

వీటి వల్ల లాభాలు. 

  పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. యాంటి ఆక్సిడెంట్లు ఆధిక మోతాదులో లభిస్తాయి. బోడకాకర కాయ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే ఫొలెట్ల వల్ల శరీరంలో కొత్త కణాలు వృద్ధి చెందుతాయి. ఇవి గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఉపయోగపడుతాయి. 

  కాయలు చక్కెర వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. ఇది రక్తంలోని చెక్కర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, ఇతర అలర్జీలు దూరమవుతాయి.

  కాయలో ఉండే కెరోటెనాయిడ్లు మనకు కంటి వ్యాధులు, క్యాన్సర్ల బారిన పడకుండా అడ్డుకుంటాయి. దీనిలోని విటమిన్‌ -సీ ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది. దీనిలో సమృద్ధిగా లభించే ఫ్లవనాయిడ్ల వల్ల వయసు పెరగటం వల్ల వచ్చే ముడుతలు తగ్గుతాయి. 

  తరచూ తినటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. బోడకాకర కాయ వండేటప్పుడు పైనున్న బొడిపెలను తీసేయకుండా వండితే మరింత ప్రయోజనం కలుగుతుంది. 

  కాయలను పూర్తిగా నూనెలో వేపుకొని తినడం వల్ల పోషకాలన్నీ అందవు. వీటిని సన్నగా కట్‌చేసి ఉప్పు, ఉల్లిగడ్డ, కారం వేసి నిప్పుల పై కాల్చుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.  


logo