గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Sep 01, 2020 , 03:06:45

ప్రణబ్‌జీ మరణం దేశానికి తీరని లోటు

ప్రణబ్‌జీ మరణం దేశానికి తీరని లోటు

  • విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 

సూర్యాపేట, నమస్తేతెలంగాణ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటని  విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల సోమవారం సంతాపం ప్రకటించారు. తెలంగాణ సమాజం ప్రణబ్‌ను  ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం వేసిన కమిటీకి ప్రణబ్‌ ముఖర్జీయే చైర్మన్‌ అని గుర్తు చేశారు.

తెలంగాణ బిల్లు ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడే ఆమోదం పొందిందని పేర్కొన్నారు. అలాంటి మహానేత మరణంతో ఏర్పడ్డ లోటు పూడ్చలేనిదన్నారు. ప్రణబ్‌ మృతిపట్ల ఎంపీ బడుగుల సంతాపం తెలిపారు. 



logo