శనివారం 26 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 31, 2020 , 01:37:56

గుట్టుగా ఆంధ్రాకు..

గుట్టుగా ఆంధ్రాకు..

  •   అక్రమంగా మద్యం రవాణా
  • సరిహద్దు గ్రామాల నుంచే దందా
  • ఇక్కడ ధర తక్కువ.. అక్కడ ఎక్కువ
  • ఇదే అక్రమార్కులకు లాభాల పంట
  • ఆరు నెలల్లో 41 కేసులు..
  •  రూ.16.50లక్షల విలువైన మద్యం సీజ్‌

ఆంధ్రాలో మద్యం ధరలు తెలంగాణ కంటే ఎక్కువ. ఇదే అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లోని సరిహద్దు గ్రామాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా మద్యాన్ని ఆంధ్రాకు తరలించి జేబులు నింపుకుంటున్నారు. దళారులకు ఈ దందా కల్పతరువుగా మారగా.. వీరికి కొంతమంది అధికారులు, సిబ్బంది సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో నిత్యం లక్షల రూపాయల మద్యం సీసాలు సరిహద్దులు దాటుతున్నాయి. సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్‌ మద్యం అక్రమ రవాణాపై నిఘా ఏర్పాటు చేయగా.. ఆరు నెలల్లోనే 41 కేసులు నమోదయ్యాయి. పోలీసులు నిత్యం తనిఖీలు చేపట్టి రూ.16.50లక్షల విలువైన మద్యాన్ని సీజ్‌చేయడంతో పాటు 52 మందిపై కేసులు నమోదు చేశారు. అక్రమాలను ప్రోత్సహిస్తున్న ఇద్దరు పోలీసులను సైతం సస్పెండ్‌ చేశారు. 


సూర్యాపేట, నమస్తే తెలంగాణ/ హుజూర్‌నగర్‌ : సాధారణంగా మద్యం పాలసీ ఒకటి లేదా రెండేళ్లకోసారి మారుతుంటుంది. తదనుగుణంగా అప్పటి వరకు ఉన్న ధరలను కొంతమేర పెంచే వెసులుబాటు ప్రభుత్వాలకు ఉంటుంది. అదే మాదిరిగా ఈ ఏడాది మన రాష్ట్రంలో ఆయా బ్రాండ్లపై 16శాతం మేర పెంచారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏకంగా 75శాతం పెంచారు.  ఈ రెండు రాష్ర్టాల మధ్య మద్యం ధరల్లో వ్యత్యాసం భారీగా  దీనిని అదునుగా చేసుకొని జేబులు నింపుకునేందుకు అక్రమార్కులు  ప్రదర్శిస్తున్నారు.  తక్కువ ధరకు కొనుగోలు చేసి పొరుగు రాష్ట్రంలో ఎక్కువ ధరకు అమ్మి  నింపుకుంటున్నారు. ప్రధానంగా జిల్లాలోని కృష్ణా తీరం వెంట ఉన్న గ్రామాలపై రెండు రాష్ర్టాల సరిహద్దులోని దళారులు కన్ను వేశారు. జిల్లా సరిహద్దు మండలాల నుంచి కొందరు దళారులు మద్యాన్ని కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని సరిహద్దు మండలాల ఛేగామాలకు తరలిస్తూ అక్రమ  

అసలే అక్రమం.. ఆపై కల్తీ..! 

పొరుగు రాష్ర్టానికి మద్యం రవాణా అనేది అసలే అక్రమం.  కల్తీ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. సీల్‌ బాటిళ్ల మూతలను అత్యంత చాకచక్యంగా తీసి  ధర మందు కలపడం, తక్కువ ధర మందులో చీప్‌ లిక్కర్‌ కలిపి ఎలాంటి అనుమానం లేకుండా తిరిగి మూతలు పెడుతున్నట్లు సమాచారం. ఇలా అక్రమ రవాణా చేసి ఆంధ్రా సరిహద్దు మండలాల్లోని మద్యం ప్రియులకు విక్రయించి వారి ఆరోగ్యాలను కొల్లగొడుతున్నారు. మామూలుగానే రెండు రాష్ర్టాల మధ్య  ధరల్లో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ..  చేస్తూ ఆయా బ్రాండ్లను బట్టి ఒక్కో ఫుల్‌ బాటిల్‌పై రూ.300 నుంచి 500 వరకు అక్రమార్జన చేస్తున్నట్లు తెలుస్తుంది.

పొరుగు రాష్ర్టానికి మద్యం తరలించి అక్రమ ఆదాయం పొందేందుకు ఎంతో మంది జేపయత్నిస్తున్నారు. గతంలో ఎలాంటి క్రైం రికార్డులు లేనివారు కూడా ఈ దందాలో భాగస్వాములై కేసుల పాలవుతున్నారు. దీనికి మద్యం వ్యాపారుల సహకారం కూడా  తెలుస్తుంది. వీరే కల్తీ బాధ్యతలు తీసుకోవడంతోపాటు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు కొంతమందికి అప్పగించడం..  జిల్లా నుంచి చాటుమాటుగా ఆంధ్రాలోని సరిహద్దు మండలాలకు తరలిస్తున్నారు. అక్కడి కన్నా ఇక్కడి నుంచి తీసుకెళ్లే మద్యం ధర తక్కువగా ఉంటుందని మద్యంప్రియులు కొనుగోలు చేస్తున్నారు. కృష్ణానది అవతలి ఒడ్డుకు గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు రకరకాల వాహనాలు, నాటు పడవలను  గత ఆరు నెలల్లో 41  నమోదు కాగా.. రూ.16.50లక్షల విలువ చేసే 1550 లీటర్ల లిక్కర్‌ సీజ్‌ చేసి 52మందిని అరెస్టు చేశారు. అలాగే 13 బైకులు, 4 ఆటోలు, 1 డీసీఎం సీజ్‌ చేశారు. ఈ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయంటే ఎవరికీ చిక్కకుండా తరలివెళ్తున్న మద్యం ఇంకా ఏ స్థాయిలో ఉందో అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ప్రత్యేక కౌంటర్లు..

తెలంగాణ నుంచి ఆంధ్రాకు మద్యం  వారి కోసం దుకాణాదారులు ప్రత్యేక కౌంటర్లను సైతం తెరిచారు. పాలకవీడు, చింతలపాలెం, మఠంపల్లి మండలాల్లోని పలు మద్యం దుకాణాల్లో ప్రత్యేక కౌంటర్లను తెరిచి అమ్ముతున్నట్లు  అలాగే హుజూర్‌నగర్‌లోని కోదాడ రోడ్డులో  ఒక మద్యం దుకాణంలోనూ హెపత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక్కడ కొనుగోలు చేసిన మద్యాన్ని కార్లు, బైక్‌లు, పడవల మీద అవతలి ప్రాంతానికి దాటిస్తున్నారు.  ఎక్కువగా రాయల్‌స్టాగ్‌, బ్లెండర్‌స్పైడ్‌, మాన్షన్‌హౌజ్‌, సిగ్నేచర్‌, ఎంసీ, ఓసీ బ్లూ, 100 పైప్స్‌, యాంటీక్విటీ, వ్యాట్‌ 69, రాయల్‌ చాలెంజ్‌ బాటిళ్లు తరలిస్తున్నారు. ఇవి ఆంధ్రప్రదేశ్‌లో డబుల్‌ రేట్లు పలుకుతున్నాయి. దీంతో అక్రమ వ్యాపారులు ఇక్కడి నుంచి వీటిని కొనుగోలు చేసి అక్కడ ఒక్కో బాటిల్‌పై రూ.500 నుంచి రూ.800 వరకు అధికంగా అమ్ముతున్నట్లు తెలిసింది.logo