బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 30, 2020 , 03:06:59

యూరియా వినియోగం తగ్గించాలి

యూరియా వినియోగం తగ్గించాలి

  • l  రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి

సూర్యాపేట‌: పంటలకు యూరియా వినియోగాన్ని తగ్గిస్తే చీడపీడల ఉధృతి తగ్గుతుందని ఈ విషయంపై అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని వ్యవసాయ విత్తనోత్పత్తి క్షేత్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విత్తనోత్పత్తి క్షేత్రంలో సాగు చేసిన కంది, వరి ఫౌండేషన్‌ విత్తన పంటలను పరిశీలించారు. అనంతరం వ్యవసాయాధికారుల తో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వం రైతులకు అందిస్తున్న వివిధ పథకాలు రైతు బంధు, క్రాప్‌ బుకింగ్‌, రైతు బీమా  ఏవిధంగా నిర్వహించాలో వ్యవసాయ విస్తరణాధికారులకు వివరించారు. ఎరువుల లభ్యత, జిల్లాలో పంటల సాగు వివరాలను డీఏఓ జి.శ్రీధర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా డిండి ప్రాజెక్టును సందర్శించారు. కార్యక్రమంలో డీఏఓ శ్రీధర్‌రెడ్డి, వ్యవసాయాధికారులు లక్పతి నాయక్‌, రవికుమార్‌, డిప్యూటీ తాసిల్దార్‌ ప్రశాంత్‌, ఏఈఓలు త్రివేణి, పరమేశ్వరి, సాయితేజ పాల్గొన్నారు. 


logo