శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 29, 2020 , 05:22:33

దళితుల భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి

దళితుల  భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి

  • జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రాములు

బొడ్రాయిబజార్‌ : దామరచర్ల, మఠంపల్లి ప్రాంతాల్లో దళితుల భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడు కేశపంగు రాములు అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వెళ్తూ సూర్యాపేట పోలీస్‌ గెస్టు హౌస్‌లో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్‌ సంజీవరెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ1972వ సంవత్సరంలోనే నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలకు మఠంపల్లి ప్రాంతాల్లో అసైన్డ్‌ భూములను పేదలకు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. తాసిల్దార్‌ స్థాయి అధికారులు అవకతవకలకు పాల్పడి దళితులకు సంబంధించిన భూముల్లో ప్రైవేట్‌ వ్యక్తులకు పట్టాలివ్వడంతో అన్యాయం జరిగినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి దయాన ందరాణి, ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శిరీష, సూర్యాపేట ఆర్డీఓ రాజేంద్రకుమార్‌, డీఎస్పీ మోహన్‌కుమార్‌, తలమల్ల హుస్సేన్‌, వంగూరి రమేశ్‌, దాసరి దేవయ్య, పాల్వాయి సురేశ్‌ పాల్గొన్నారు. 


logo