బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 28, 2020 , 03:58:35

సబ్బండ వర్గాల జీవితాల్లో వెలుగులు

సబ్బండ వర్గాల జీవితాల్లో వెలుగులు

  • టీఆర్‌ఎస్‌ పాలనలోనే కుల వృత్తులకు ఆదరణ
  • మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం నింపిన సీఎం కేసీఆర్‌
  • ఉచిత చేప పిల్లలను వదిలిన మంత్రి జగదీశ్‌రెడ్డి
  •  191మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు అందజేత
  •  టీఆర్‌ఎస్‌ పాలనలోనే కుల వృత్తులకు ఆదరణ
  • మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం నింపిన సీఎం కేసీఆర్‌
  • ఉచిత చేప పిల్లలను వదిలిన మంత్రి జగదీశ్‌రెడ్డి
  •  191మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు అందజేత

`తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు  పథకాలకు శ్రీకారం చుట్టారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. పలు ప్రోత్సాహకాలతో చేతి వృత్తులకు పూర్వ వైభవం లభించిందని, నీలి విప్లవం ద్వారా మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం నెలకొన్నదని మంత్రి పేర్కొన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలంలో చీదెళ్ల పెద్ద చెరువు, మాచారం రాయిచెరువులో చేపపిల్లలను వదిలారు. ప్రభుత్వం అందజేసిన బైకులు, ట్రాన్స్‌పోర్టు వాహనాలు, పనిముట్లు సద్వినియోగం చేసుకుని మత్స్యకారులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. అనంతరం ఎంపీపీ కార్యాలయంలో 191మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. 


పెన్‌పహాడ్‌ : గత పాలకుల హయాంలో దగాపడ్డ తెలంగాణలో కులవృత్తులు చీకటిమయంగా మారాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో సబ్బండ వర్గాల జీవితాల్లో వెలుగులు నిండాయని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చీదెళ్ల పెద్దచెరువు, మాచారం రాయిచెరువులో జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, మత్స్యశాఖ అధికారి సౌజన్యతో కలిసి రెండు లక్షల చేపపిల్లలను వదిలారు. మత్స్యకార్మికుల సంక్షేమం కోసం ఉచితంగా 80కోట్ల చేపపిల్లలు, 5కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఏరాష్ట్రంలో లేని విధంగా మత్స్యకార్మికులకే కాకుండా చేతివృత్తుల వారి కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టి అమలుచేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులకు వందల కోట్లతో ద్విచక్రవాహనాలు, పనిముట్లు అందించి ఆదుకున్న ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్‌ అని పేర్కొన్నారు. 
191మందికి చెక్కుల పంపిణీ 
పెన్‌పహాడ్‌ ఎంపీపీ కార్యాలయంలో మండలంలోని 191మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా అన్నివర్గాలకు లబ్ధి చేకూరేలా చేయడం మన అదృష్టమన్నారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ వైస్‌చైర్మన్‌ వెంకటనారాయణగౌడ్‌, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనితాఅంజయ్య, ఆర్డీఓ రాజేంద్రకుమార్‌, మారిపెద్ది శ్రీనివాస్‌, తాసిల్దార్‌ ఆంజనేయులు, ఎంపీడీఓ వేణుమాధవ్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు వెన్న సీతారాంరెడ్డి, నాతాల జానకీరాంరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. 
కలెక్టరేట్‌లో 196మందికి.. 
చివ్వెంల : మండలానికి చెందిన 196మందికి రూ.1,90,97,000 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను మంత్రి జగదీశ్‌రెడ్డి కలెక్టరేట్‌లో లబ్ధిదారులకు అందజేశారు. చెక్కులు అందుకున్నవారిలో 12మంది ఎస్సీ, 70ఎస్టీ, 105 బీసీ, 9మంది ముస్లిం లబ్ధిదారులు ఉన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్‌ డి. సంజీవరెడ్డి, జడ్పీటీసీ భూక్యా సంజీవనాయక్‌, ఎంపీపీ ధరావత్‌ కుమారిబాబునాయక్‌, వైస్‌ ఎంపీపీ జూలకంటి జీవన్‌రెడ్డి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.  
టీఆర్‌ఎస్‌లో 300మంది చేరిక 
సూర్యాపేట టౌన్‌ : ఆరేళ్లలోనే సంచలనాత్మక అభివృద్ధికి  ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని, రాబోయే రోజుల్లో సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్‌, బీజేపీల అడ్రస్‌ గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తుందని  మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాగారం  జడ్పీటీసీ కడియం ఇందిరాపరమేశ్‌, వర్ధమానుకోట ఎంపీటీసీ పరశురాములు, వార్డుమెంబర్లు జయమ్మ, పరశురాములు,  పద్మారావులతోపాటు సుమారు 300మంది నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్‌లో ఎలాంటి విభేదాలు లేవని, కొత్త పాత తేడా లేకుండా అంతా కలిసికట్టుగా నిరంతరం ప్రజాభివృద్ధికి పాటుపడాలన్నారు.  జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, వైస్‌ ఎంపీపీ గుంటకండ్ల మణిమాల, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గుండగాని అంబయ్య, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కల్లెట్లపల్లి పుల్లయ్య, పొనగంటి నర్సింహారావు, కడారి యాదవరెడ్డి, యారాల రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.    
డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు పరిశీలన  
మునగాల : మండలంలోని నేలమర్రి, మాధవరం రహదారి వెంట ఎస్‌ఎం పేట రెవెన్యూ పరిధిలో పద్మావతి డ్రాగన్‌ ఫామ్‌లో శ్రీనివాస్‌, పద్మావతి దంపతులు సాగు చేసిన డ్రాగన్‌ఫ్రూట్‌  పంట సాగును మంత్రి జగదీశ్‌రెడ్డి పరిశీలించారు. సంప్రదాయ పంటల సాగు కాకుండా   వాణిజ్య పంటల వైపు మొగ్గుచూపడం అభినందనీయమన్నారు. రెండున్నర ఎకరాల్లో సాగుచేసిన తోటలో మొదటి సంవత్సరంలోనే రూ.8లక్షలు సంపాదించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు శ్రీధర్‌, సైదయ్య, రైతులు శ్రీనివాస్‌, పద్మావతి, సీఐ శివశంకర్‌గౌడ్‌, ఎస్‌ఐ సత్యనారాయణగౌడ్‌ పాల్గొన్నారు.  


logo