ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 28, 2020 , 02:52:26

అనుమతి లేకుండా కరోనా పరీక్షలు చేస్తే చర్యలు

అనుమతి లేకుండా కరోనా పరీక్షలు చేస్తే చర్యలు

  • డీఎంహెచ్‌ఓ హర్షవర్ధన్‌
  • ‘పేట’లో ప్రైవేట్‌ దవాఖానల తనిఖీ

సూర్యాపేట టౌన్‌ : ప్రైవేట్‌ దవాఖానల్లో అనుమతి లేకుండా కరోనా పరీక్షలు, వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ హర్షవర్ధన్‌ హెచ్చరించారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రైవేట్‌ దవాఖానల్లో అందిస్తున్న సేవల పర్యవేక్షణలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని మెట్రో, కమల దవాఖానల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మాట్లాడారు. ప్రైవేట్‌ దవాఖానల్లో అనుమతి లేకుండా కరోనా పరీక్షలు, ట్రీట్‌మెంట్‌ గానీ చేయకూడదన్నారు. అన్ని దవాఖానల్లోని వార్డుల్లో శానిటైజేషన్‌ నిర్వహణ ప్రమాణాల ప్రకారం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా అనుమానితులను దవాఖానల్లో చేర్చుకుంటే ఇతర రోగులకు సైతం కరోనా సోకే అవకాశముందన్నారు. దవాఖానల్లో ఇన్‌ పేషెంట్‌ లిస్టు వివరాలను పరిశీలించి అవి నిబంధనల ప్రకారం లేవని.. అలాగే మెడికల్‌ దుకాణాల్లో లైసెన్స్‌ చూపడం లేదని  మండిపడ్డారు. కరోనా విషయంలో రోగులను భయాందోళను గురిచేస్తూ వారి నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు. కరోనా పరీక్షలు కేవలం ప్రభు త్వ ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే చేస్తున్నారని. ప్రైవేట్‌ దవాఖానల్లో ఎలాంటి  కరోనా పరీక్షలు చేయకూడదని ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించేలా పరీక్షలు నిర్వహిస్తే   సీజ్‌ చేస్తాన మన్నారు . ఈ కార్యక్రమంలో హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మధుసూదన్‌, ప్రోగ్రాం మేనేజర్‌ భాస్కర్‌ రాజు పాల్గొన్నారు.       logo