శనివారం 26 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 27, 2020 , 07:04:13

పచ్చగా, పరిశుభ్రంగా..జ్వరాలకు దూరంగా..

పచ్చగా, పరిశుభ్రంగా..జ్వరాలకు దూరంగా..

  • మిషన్‌ భగీరథ, పల్లె ప్రగతి కార్యక్రమాలతో సీజనల్‌ వ్యాధులకు చెక్‌
  • పరిశుభ్రంగా మారిన పల్లెలు..
  • అందుతున్న స్వచ్ఛమైన తాగునీరు
  • కరోనా నేపథ్యంలో జ్వరాలపై మరింత  మచ్చుకు కూడా కనిపించని మలేరియా

సమైక్య పాలనలో వానకాలం వచ్చిందంటే  స్ల్రెలను  జ్వరాలు, అంటువ్యాధులు చుట్టుముట్టేవి. తండాలు  గురై మంచం పట్టేవి.  ఊళ్లో వందల సంఖ్యలో  బారిన పడి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లేవారు.   పరిస్థితి మారింది. తెలంగాణ సర్కారు  చర్యలతో సీజనల్‌ వ్యాధులు దరి చేరడం లేదు. మిషన్‌ భగీరథ, పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలతో  చేసిన తాగునీరు అందిస్తుండడం,గ్రామాలు పరిశుభ్రంగా మారడం, స్వచ్ఛమైన గాలి అందుతుండడంతో  తగ్గుముఖం పట్టాయి. గతంలో ఉమ్మడి జిల్లాను వణికించిన మలేరియా.. ఇప్పుడు కనిపించకుండా పోయింది. 2014లో నల్లగొండ జిల్లాలో 22 కేసులు నమోదు కాగా.. ఈ  ఒక్కటీ నమోదు కాకపోవడం గమనార్హం.          - సూర్యాపేట, నమస్తే తెలంగాణ

250 కుటుంబాలున్న చందంపేట    చేతిపంపు నీరే దిక్కు.ప్రతి ఏటా   వ్యాధులు   అధికార యంత్రాంగం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించేవారు.  పల్లె ప్రగతి కార్యక్రమంతో  పరిశుభ్రంగా మారింది. మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతున్నారు. మిషన్‌ భగీరథ  స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారు. దీంతో సీజనల్‌ వ్యాధులు దరిచేరడం లేదని ఆ గ్రామస్తులు పేర్కొన్నారు.

నల్లగొండ జిల్లాలో..

సంవత్సరం  మలేరియా  డెంగీ      చికున్‌గున్యా    మెదడువాపు     
2014       22         0       0             0                  
2015       08        31       0             0                  
2016       18        53       0               0                   
2017         3               8            0         0                    
2018          2          72       14           0                     
2019         0       165          61             1                        
2020         0           16          3          0


సూర్యాపేట, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలతో సీజనల్‌గా వచ్చే అంటువ్యాధులు దూరమవుతున్నాయి. గతంలో నిధుల లేమితో పల్లెలు కొట్టుమిట్టాడేవి. కానీ సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో చేపడుతున్న కార్యక్రమాలతో పల్లెల్లో పసిడి వెలుగులు విరజిమ్ముతున్నాయి. ప్రధానంగా వేల కోట్ల రూపాయలు వెచ్చించి మిషన్‌ భగీరథం పూర్తి చేసి ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారు. పల్లె ప్రగతితో పల్లెలు పచ్చగా, పరిశుభ్రంగా మారుతున్నాయి. వెరసి జ్వరాలకు చెక్‌ పడుతోంది. చివరి రెండేళ్లలో నల్లగొండ జిల్లాలో మలేరియా మచ్చుకు కూడా కనిపించకుండా పోగా సూర్యాపేటలో మాత్రం ఒకటి రెండు కేసులు నమోదయ్యాయి. గత ఉమ్మడి రాష్ట్రంలో వర్షాకాలం వస్తుందంటే చాలు అనేక రకాల అంటువ్యాధులతో పల్లెలు పడకేసేవి. స్వచ్ఛమైన తాగునీరు దొరక్కపోగా గ్రామాలు మురికి వాడలుగా కనిపించేవి. గుంతలు, బురద మయంగా వీధులు..ఎక్కడికక్కడే పేరుకుపోయిన చెత్తా చెదారం వెరసి దోమలు, ఈగలతో ప్రజలు సావా సం చేసేవారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఆరేళ్లలో సీన్‌ మారిపోయింది. వేల కోట్లు వెచ్చించి గ్రామాల్లో రోడ్లు, మండలాలు, జిల్లా కేంద్రాలకు లింకురోడ్లు వేయడంతో చాలావరకు వీధుల్లో బురద, గుంతలు మాయమై నీరు నిలిచే ప్రదేశాలు మాయమయ్యాయి. ఏడాది కాలంగా రాష్ట్రంలో పల్లెప్రగతి పేరిట చేపడుతున్న విషయం విదితమే. దీంతో నెలనెలా గ్రామాలకు కోట్లాది రూపాయలు విడుదలవుతున్నాయి. ఈ నిధులతో మురుగు కాల్వల నిర్మాణాలు, పాత ఇండ్లు తొలగించడం, ఒట్టిపోయిన బావులను పూడ్చివేయడం, పిచ్చి మొక్కలను తొలగింపు, పండ్ల మొక్కలను లక్షలాదిగా నాటుతుండడం, గ్రామాల్లో డంపింగ్‌ యార్డుల ఏర్పాటు, ఇంటింటికీ చెత్త సేకరణ, ప్రతి గ్రామానికి ట్రాక్టర్లు కొనుగోలు చేయడం లాంటి అనేక కార్యక్రమాలతో పల్లెలు ఆహ్లాదకరంగా మారాయి. 
వ్యాధులూ ఆమడ దూరం
పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు పరిశుభ్రంగా దర్శనమిస్తుడడంతో ప్రజల నుంచి  వ్యాధులు ఆమడ దూరం వెళ్తున్నాయి. సాధారణంగా వర్షాకాలం వస్తుందనగానే అంటువ్యాధులు ప్రబలేవి. కానీ ప్రభుత్వం, అధికారుల ముందస్తు చర్యలు మరింత సత్ఫలితాలను ఇస్తున్నాయి. గ్రామాల్లో   నీటిలో దోమలు వృద్ధి చెందే ప్రాంతాలను శుభ్రం చేయడంతో పాటు వీధుల వెంట చెట్లు తీసివేయడం, చెత్తా చెదారం తొలగించడంతో దోమలను లార్వా దశలోనే అంతం చేస్తున్నారు. దీంతో సీజనల్‌గా వచ్చే డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, మెదడువాపు, పైలేరియా లాంటి వ్యాధులు కూడా చాలా తక్కువ సంఖ్యలో నమోదయ్యాయి. 
కేసు నమోదు ఇలా..
మలేరియా ప్రతి సంవత్సరం 30 నుంచి 40 కేసులు నమో దు కాగా రెండేళ్లుగా నల్లగొండ జిల్లాలో   ఒక్క కేసు కూడా నమోదు కాకపోగా సూర్యాపేటలో మాత్రం రెండు నమోదయ్యాయి. నల్లగొండలో డెంగీకి సంబంధించి గతేడాది 165 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం ఇప్పటివరకు కేవలం 16 మాత్రమే నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో గతేడాది ఐదు నమోదు కాగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఒక్కటి నమోదైంది. చికున్‌గున్యా జ్వరాలు గతేడాది నల్లగొండలో 61 కేసులు కాగా ఈ సంవత్సరం ఇప్పటివరకు కేవలం మూడు నమోదు కాగా సూర్యాపేటలో గతేడాది 14 కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 1 మాత్రమే నమోదైంది.     

50 శాతం మందుల కొనుగోలు తగ్గింది 

గతంతో పోలిస్తే ఈ ఏడాది సీజనల్‌ వ్యాధులు తగ్గు ముఖం పట్టడంతో మెడికల్‌ దుకాణాల్లో ఆ మందులు అడిగే వారే కరువయ్యారు.  ఈ ఏడాది కరోనా విజృంభిస్తుండడంతో  ఇమ్యూనిటీకి సంబంధించిన మందుల కొనుగోలుతో వారి వ్యాపారం కొంతమేర లాభదాయకంగా సాగుతుందని తెలుస్తుంది. ఈ  ఏడాది సీజనల్‌ వ్యాధులకు సంబంధించిన మందుల కొనుగోలు 50 శాతానికి పైగా తగ్గినవనే చెప్పుకోవాలి.  
        - కార్తీక్‌ భరద్వాజ్‌ ,డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, సూర్యాపేట


logo