ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 24, 2020 , 03:26:18

పారిశుధ్య కార్మికుడి వీడియోపై మంత్రి కేటీఆర్‌పై ఆగ్రహం

 పారిశుధ్య కార్మికుడి వీడియోపై మంత్రి కేటీఆర్‌పై ఆగ్రహం

నడిగూడెం: మండలంలోని రామాపురం గ్రామంలో ఇటీవల ఓ పారిశుధ్య కార్మికుడు మురుగు కాల్వ పూడికతీత పనులు చేస్తుండగా స్థానిక యువకులు వీడియో తీశారు. కల్వర్టు వద్ద ఉన్న డ్రైనేజీ కాల్వలోకి వెళ్లి పూడిక తీసే దృశ్యాలు వాట్సాప్‌లో  వైరల్‌ అయ్యింది. ఆ వీడియోను కోదాడకు చెందిన ఎన్‌ఆర్‌ఐ జలగం సుధీర్‌ పారిశుధ్య కార్మికులకు ఆధునాతన పరికరాలు అందించాలని మంత్రి కేటీఆర్‌కు ట్విట్‌ చేశారు. స్పందించిన మంత్రి కేటీఆర్‌ ఆదివారం ఈ విషయంపై కలెక్టర్‌, ఎంపీడీఓ, ఎంపీఓ, గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు సర్పంచ్‌ వివరణ కోరుతూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎంపీఓ లింగారెడ్డిని వివరణ కోరగా సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు పంపిస్తున్నట్లు తెలిపారు. logo