శనివారం 26 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 24, 2020 , 02:15:03

రెండు గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల

రెండు గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు రెండు క్రస్టు గేట్ల ద్వారా ఆదివారం నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టులోకి 3950 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 3260 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో దిగువకు వదులుతున్నారు. 3110క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా, 100 క్యూసెక్కుల నీటిని కాలువలకు వదులుతుండగా 50క్యూసెక్కుల నీరు ఆవిరవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులకు(4.46 టీఎంసీలు) ప్రస్తుతం 642.85 అడుగులు(3.90 టీఎంసీలు) ఉన్నట్లు ఏఈ శ్రీకాంత్‌ తెలిపారు.

నాలుగు తడులుగా నీటి విడుదల

వానకాలానికి సంబంధించి కుడి, ఎడమ కాలువలకు సాగునీటిని అందించేందుకు అధికారులు ఆదివారం తేదీలను ప్రకటించారు. వారబందీ పద్ధతిన నాలుగు తడులుగా నీటిని  విడుదల చేయనున్నారు.

మొదటి విడుతగా ఈనెల 15 నుంచి వచ్చేనెల 9వ తేదీ వరకు 25రోజులు, 15రోజుల విరామం తర్వాత, రెండో విడుత 24 సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్‌ 9వరకు 15రోజులపాటు నీటి విడుదల, 15రోజుల విరామం తర్వాత మూడోవిడత అక్టోబర్‌ 24 నుంచి నవంబర్‌ 8వరకు 15రోజులపాటు నీటి విడుదల, 15రోజుల విరామం తర్వాత 4వ విడుతగా నవంబర్‌ 23 నుంచి ప్రాజెక్టులో ఉన్న నీటి లభ్యత ఆధారంగా విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.


logo