శనివారం 19 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 22, 2020 , 02:53:52

శ్రీశైలం సూర్యాపేట వాసులు ఇద్దరు దుర్మరణం

శ్రీశైలం  సూర్యాపేట వాసులు ఇద్దరు దుర్మరణం

  • జగన్‌తండాకు చెందిన సుందర్‌నాయక్‌
  • మద్దిరాల వాసి మహేశ్‌కుమార్‌ మృతి
  • స్వగ్రామాల్లో విషాదఛాయలు

శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో సూర్యాపేట జిల్లాకు  ఇద్దరు దుర్మరణం చెందారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఏఈగా విధులు నిర్వహిస్తున్న చివ్వెంల మండలం జగన్‌తండాకు చెందిన ధరావత్‌ సుందర్‌నాయక్‌, ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న మద్దిరాల మండల కేంద్రానికి చెందిన వడ్డాణం  మృతిచెందారు. దీంతో వారి స్వగ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి

పెద్ద  కోల్పోయిన కుటుంబం..

చివ్వెంల : శ్రీశైలం ప్రమాదంలో  జగన్‌తండాకు చెందిన సుందర్‌నాయక్‌ (35) మృతిచెందడంతో ఆ కుటంబం పెద్ద దిక్కును కోల్పోయింది.  తండ్రి నాగేశ్వర్‌రావు కోఅపరేటివ్‌ బ్యాంకులో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌. సుందర్‌కు తల్లి కమలమ్మ, భార్య ప్రమీల, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు ఉన్నారు. ఎంటెక్‌ చేసిన సుందర్‌నాయక్‌ 2016లో మొదటి ప్రయత్నంలోనే ఏఈ ఉద్యోగం సాధించాడు. కాగా.. సుందర్‌నాయక్‌కు నెల రోజుల క్రితం కరోనా రావడంతో సొంత గ్రామంలో 15రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండి కోలుకున్నాడు. ఇటీవలే విధుల్లో చేరిన ఆయన.. గురువారం రాత్రి 9గంటలకు శ్రీశైలం ఎడమ జల విద్యుత్‌ కేంద్రంలో విధులకు హాజరయ్యాడు. అక్కడ జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న సుందర్‌ మృతిచెందడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తండావాసులు పెద్ద సంఖ్యలో సుందర్‌ ఇంటి వద్దకు చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు.  

కుటుంబ పోషణకు వెళ్లి అనంత లోకాలకు..

మద్దిరాల : కరోనా వల్ల ఉపాధి  కుటుంబ పోషణ కోసం వెళ్లిన వడ్డాణం మహేశ్‌కుమార్‌ (33) ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు.  మండల కేంద్రానికి చెందిన మహేశ్‌కుమార్‌ వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. ఐటీఐ చేసిన మహేశ్‌..  సంవత్సరాలుగా పలు ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నాడు.   రైల్వే స్టేషన్‌లో అమరాన్‌ కంపెనీ తరఫున కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఎలక్ట్రికల్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. భార్య స్వాతి, కూతురు ప్రియదర్శిని (8), కుమారుడు రిషివర్మ (14 నెలలు)తో కలిసి వరంగల్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. కరోనా వల్ల రైళ్లు  ఉద్యోగం పోయింది.  క్రితం స్నేహితుడితో కలిసి శ్రీశైలం విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో పని కోసం కంపెనీ తరఫున వెళ్లాడు. విధి నిర్వహణలో ఉండగా, ప్రమాదంలో చిక్కుకొని మరణించాడు. దీంతో  విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక్కగానొక్క  మృతిచెందడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. 


logo