మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 21, 2020 , 10:48:04

మనోధైర్యంతో కరోనాను ఎదుర్కోవచ్చు

మనోధైర్యంతో కరోనాను ఎదుర్కోవచ్చు

  • నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ప్రోగ్రాం అధికారి డా.ప్రసాద్‌ 

చిలుకూరు : మనోధైర్యంతో కరోనాను ఎదుర్కోవచ్చని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ప్రోగ్రాం అధికారి డా.ప్రసాద్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆయన పరిశీలించారు.  కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, తీసుకుంటున్న జాగ్రత్తల గురించి మండల వైద్యాధికారి ప్రమోద్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ వినోద్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

గరిడేపల్లి, కల్మల్‌చెర్వు పీహెచ్‌సీల పరిశీలన  

గరిడేపల్లి : మండల కేంద్రంతోపాటు కల్మల్‌చెర్వులోని పీహెచ్‌సీలను గురువారం కొవిడ్‌ అసెస్‌మెంట్‌ సర్వే టీం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించే ప్రదేశాలను పరిశీలించి పరీక్షలు చేసే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు.  పాజిటివ్‌ వచ్చిన వారికి ఏం మందులు ఇస్తున్నారు, వారికి ఎలాంటి సూచనలు చేస్తున్నారు అని అడిగారు. పీహెచ్‌సీల్లో కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించారు. కార్యక్రమంలో మలేరియా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నాగయ్య, స్టాటిస్టికల్‌ అధికారి సైదులు, ప్రోగ్రాం అధికారి సాహితి, సబ్‌ యూనిట్‌ అధికారి శ్రీనివాసరాజు, స్థానిక వైద్యాధికారులు బంగారు రమ్య, సుధీర్‌, సిబ్బంది పాల్గొన్నారు.  శ్రీరంగాపురంలో ఇంటింటి సర్వే

నడిగూడెం : మండలంలోని శ్రీరంగాపురంలో త్రిపురవరం పీహెచ్‌సీ ఆధ్వర్యంలో గురువారం ఇంటింటికీ  తిరిగి జ్వరాల సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ గ్రామంలో కరోనా అనుమానితులను గుర్తించి పరీక్షలు నిర్వహించగా తండ్రీకొడుకులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు చెప్పారు. ప్రైమరీ, సెకండ్‌ కాంటాక్ట్‌లను హోంక్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నివాసాల పరిసరాల్లో మురుగు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామపంచాయతీ సిబ్బంది కరోనా బాధిత ఇంటి వద్ద హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. వైద్య, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. 

ప్రతి రోజూ కరోనా పరీక్షలు 

నడిగూడెంలోని వైద్య కేంద్రంలో ప్రతి రోజూ కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారి సంజయ్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయనున్నట్లు పేర్కొన్నారు. సెలవు రోజులోనూ ఉదయం 10నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. గురువారం 10మందికి పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. logo