సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 17, 2020 , 03:14:36

ఆన్‌లైన్‌లో ఆడిట్ రిపోర్ట్‌

ఆన్‌లైన్‌లో ఆడిట్ రిపోర్ట్‌

  • l  ఈ ఏడాది నుంచి ప్రయోగాత్మకంగా అమలు
  • l  25 శాతం జీపీల ఆడిట్‌ నివేదికలు ఆన్‌లైన్‌లో  
  • l  నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 325 జీపీల్లో కొనసాగుతున్న ఆడిట్‌
  • l  ఈ విధానంతో నిధుల  దుర్వినియోగానికి అడ్డుకట్ట

గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులు దుర్వినియోగం కాకుండా నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు గాను జీపీల ఆడిట్‌ రిపోర్టును ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది. మొదటగా 25 శాతం గ్రామపంచాయతీల ఆడిట్‌ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని నిర్ణయించిన జిల్లా ఆడిట్‌ అధికారులు.. నల్లగొండలో 211, సూర్యాపేటలో 114 గ్రామాల్లో ఈ ఆడిట్‌ నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్‌ చివరి నాటికి ఆడిట్‌ పూర్తి చేసి ఆన్‌లైన్‌లో పొందు పర్చనున్నారు. ఆడిట్‌ రిపోర్ట్‌ ఆన్‌లైన్‌లో ఉంటే ఖర్చుల వివరాలు తెలుసుకొని నిధుల దుర్వినియోగాన్ని గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 

నల్లగొండ  గ్రామపంచాయతీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన ప్రతి పైసా ఖర్చు వివరాలు తెలిసేలా ఆడిట్‌ చేసిన నివేదికలు ఆన్‌లైన్‌లో పొందుపరుచాలని ప్రభుత్వం భావించింది.  ప్రభుత్వం సూచన మేరకు ఈ ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే విధంగా తెలంగాణ సర్కారు చర్యలు చేపట్టింది. అన్ని పంచాయతీల్లో ఒకేసారి అమలు చేయడం సాధ్యం కానందున.. తొలుత 25 శాతం గ్రామపంచాయతీలను ఎంపిక చేశారు.  నేపథ్యంలో జిల్లా ఆడిట్‌ యంత్రాంగం నల్లగొండ  211, సూర్యాపేటలో 114 గ్రామాల్లో ఆడిట్‌ ప్రారంభించింది.  గ్రామాల్లో సెప్టెంబర్‌ చివరి నాటికి పూర్తి చేసి ఆన్‌లైన్‌లో పొందు పరుచనున్నారు. మిగిలిన 75 శాతం గ్రామపంచాయతీల్లో  తర్వాత ఆఫ్‌లైన్‌లో చేయనున్నారు.  రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన నిధుల వివరాలు.. ఖర్చు, గౌనియోగించిన విధానంపై పూర్తి నివేదిక ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తే కింది స్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు చూస్తారు.  నిధుల దుర్వినియోగం జరిగితే వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో పాలకవర్గాలు సైతం దుర్వినియోగానికి పాల్పడే అవకాశానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టొచ్చనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

తొలి విడుత 25 శాతం 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామపంచాయతీలకు ప్రతి ఏటా నిధులు విడుదల చేస్తున్నాయి. వాటి వినియోగంపై ఆడిట్‌ అధికారులతో ఆడిట్‌ చేయించి ఆ నివేదికను హార్డ్‌ కాపీ రూపంలో ఉంచుతారు. అయితే.. ఈసారి కేంద్రం సూచన మేరకు ఆడిట్‌ నివేదికలను ఆన్‌లైన్‌లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.  ఆర్థిక సంఘం నిధులు పొందడానికి జిల్లాలో ఉన్న మొత్తం గ్రామపంచాయతీల్లో కనీసం 25శాతం ఆడిట్‌ చేసిన నివేదికలను ఆన్‌లైన్‌లో పెట్టాలని కేంద్రం  సూచన చేసింది. దీంతో తెలంగాణ సర్కార్‌ తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో ఆడిట్‌ రిపోర్టులు పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించడంతో తైపక్రియ కొనసాగుతున్నది. నల్లగొండ జిల్లాలో 844 గ్రామపంచాయతీలు ఉండగా.. ప్రస్తుతం 211 పంచాయతీల్లో ఆడిట్‌ చేస్తున్నారు.  జిల్లాలో 473 పంచాయతీలకుగాను 114 గ్రామపంచాయతీల్లో ఆడిట్‌ జరుగుతుంది. రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 325 గ్రామపంచాయతీల్లో సెప్టెంబర్‌ 30 నాటికి  పూర్తి చేసి కేంద్రం ఇచ్చిన పోర్టల్‌లో  చేయాలని సర్కార్‌ ఆదేశించింది. మిగిలిన 75శాతం గ్రామపంచాయతీల్లో అక్టోబర్‌ నుంచి ఆడిట్‌ చేయాల్సి ఉన్నప్పటికీ వాటి నివేదికలను ఆన్‌లైన్‌లో పెట్టాల్సిన అవసరం లేదు.

అన్ని నివేదికలు ఆన్‌లైన్‌లోనే..

ప్రతి ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి శాఖకు నిధులు విడుదల చేస్తుంటాయి.  నిధుల వినియోగం ఏ విధంగా జరిగిందో తెలుసుకోవడానికి ఆడిట్‌ చేపడుతారు.  ఓ ఆడిట్‌ బృందం ప్రత్యేకంగా ఆడిట్‌ చేస్తున్నప్పటికీ ఆ నివేదిక హార్డ్‌ కాపీలోనే ఉండటంతో  పరిశీలనలోనే గమనించే అవకాశం ఉంటుంది. నిధుల దుర్వినియోగంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తేనే తప్ప ఆ నివేదిక బయటకు రాదు. కాలానుగుణంగా టెక్నాలజీ సైతం పెరుగడంతో ప్రభుత్వం ఆడిట్‌ నివేదికలకు ఆన్‌లైన్‌ ఆప్షన్‌ను ఎంచుకుంది. అందులో ఈ ఏడాది  ప్రయోగాత్మకంగా 25 శాతం గ్రామపంచాయతీల్లో చేసిన ఆడిట్‌ నివేదికలను ఆన్‌లైన్‌లో భద్రపరుచాలని సూచించిన కేంద్రం ఇందుకు ఓ పోర్టల్‌ను కేటాయించింది. దీని తర్వాత మున్సిపాలీటీల్లో చేసిన ఆడిట్‌ నివేదికలు ఆన్‌లైన్‌లో పెట్టనున్నారు. ఆన్‌లైన్‌ ప్రక్రియకు గ్రామపంచాయతీలైనా, మున్సిపాలిటీలైనా..  ఏ శాఖ అయినా వాటి రెగ్యులర్‌ ప్రక్రియలు ఆన్‌లైన్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆడిట్‌ బృందాలకు పని సులభం అవుతుంది. ఇదిలా ఉండగా రానున్న రోజుల్లో విడుతల వారీగా అన్ని ఆడిట్‌ నివేదికలు ఆన్‌లైన్‌లో  చర్యలు చేపడుతున్నారు. 

నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకే..

గ్రామ పంచాయతీలను అన్ని విధాలుగా అభివృద్ధి  ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని తీసుకొచ్చింది. అంతేగాక పల్లెల్లో పల్లెప్రగతి, పట్టణాల్లో పట్టణ ప్రగతి అమలు చేస్తుంది. అలాగే.. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి నిధులు ఇస్తున్నాయి. గత సెప్టెంబర్‌ నుంచి ప్రతి నెలా  జిల్లాకు  సూర్యాపేటకు రూ.11కోట్లు విడుదల చేస్తున్నాయి.  నిధుల వినియోగం వివరాలు కింది స్థాయి నుంచి  స్థాయి అధికారి వరకు తెలియాలంటే ఆన్‌లైన్‌లో ఆడిట్‌ నివేదికలు పొందుపరుచాలని కేంద్రం నిర్ణయించి రాష్ర్టాలకు సూచించింది.  ఏ గ్రామపంచాయతీలోనైనా నిధుల దుర్వినియోగం జరిగితే అందరికీ  వారిపై చర్యలు, ఆపై నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడనుంది. తొలుత 25శాతం గ్రామాల్లో జరిగే ఆడిట్‌ నివేదికలు ఆన్‌లైన్‌లో పెట్టి క్రమంగా అన్నింటినీ  అమలు చేయనున్నారు.logo