బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 16, 2020 , 02:14:35

మూసీ కాల్వలకు నీటి విడుదల

  మూసీ కాల్వలకు నీటి  విడుదల

కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలతో కలిసి శనివారం ఆయన సాగునీటిని విడుదల చేసి మాట్లాడారు.  నిజాం కాలంలో నిర్మించిన మూసీ ప్రాజెక్టును గత పాలకులు ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని అయితే తెలంగాణ ఏర్పాటు అనంతరం మూసీకి పట్టిన గత పాలకుల పాపాలను కడిగేశామన్నారు. సమైక్య నాయకుల ద్రోహం ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకుల నిర్లక్ష్యంతో మూసీ ఆయకట్టు రైతాంగానికి శాపంగా మారిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించి రూ. 21 కోట్లతో మూసీ ప్రాజెక్టును ఆధునికీకరించడం వల్ల చివరి భూములకు కూడా నీరు అందుతుందని మంత్రి గుర్తు చేశారు.  ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయిలోకి వచ్చిందన్నారు. మూసీ చివరి ఆయకట్టుకు నీళ్లను అందిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఈఈ భద్రునాయక్‌, డీఈ నవీకాంత్‌, ఏఈ శ్రీకాంత్‌, నాయకులు కొప్పుల ప్రదీప్‌రెడ్డి, కర్ర ప్రభాకర్‌రెడ్డి, చల్లా కృష్ణారెడ్డి పాల్గొన్నారు.  


logo