ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 16, 2020 , 02:14:37

మూడు నదుల నీటితో జిల్లా సస్యశ్యామలం

  మూడు నదుల నీటితో జిల్లా సస్యశ్యామలం

l   స్వాతంత్య్ర వేడుకల్లో  మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట, నమస్తే తెలంగాణ : కృష్ణా, గోదావరి, మూసీ మూడు నదుల నీటితో ఉమ్మడి నల్లగొండ జిల్లా పచ్చగా, సస్యశ్యామలంగా మారిందని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత పోలీసు గౌరవ వం దనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.   జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధ్ది, సంక్షేమాలు రెండు కళ్లు అని, ప్రజలు సంతోషంగా ఉండడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష అన్నారు. కాళేశ్వరం గోదావరి నీటితో సూర్యాపేట జిల్లా  పచ్చగా మారిందని, గత యాసంగిలో రాష్ట్రం లో అత్యధిక దిగుబడులు సాధించిన జిల్లాగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నిలవడం గర్వకారణంగా ఉందన్నారు. 

తిరుగులేని వ్యవసాయం 

రాష్ట్ర ప్రభుత్వం రైతులు తిరుగులేని వ్యవసాయం చేసేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని మంత్రి చెప్పారు. సూర్యాపేట జిల్లాలో ఈ వానకాలంలో ఇప్పటి వరకు 3లక్షల12వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా నియంత్రిత సాగు విధానంలో వరిలో సన్నరకాలు అధికంగా సాగు చేసేందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు. తదనుగుణంగా జిల్లాలో అవసరమైన 3లక్షల 98వేల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు, 1లక్ష 45 వేల టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు. రైతుబంధు పథకం ద్వారా ఈ సంవత్సరం    రైతులకు 494 కోట్లు మంజూరు చేశామన్నారు. 980 మంది రైతులకు  బీమా డబ్బులు అందినట్లు చెప్పారు. సమగ్ర వ్యవసాయ విధానంలో ప్రతి 5వేల ఎకరాలు క్లస్టర్ల వారీగా 82 రైతు వేదికలను రూ.18కోట్లతో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే రూ 31కోట్లతో 4,500ల కల్లాలకు ప్రణాళికలు రూపొందించి 2,838 కల్లాలు మంజూరై పనులు పురోగతిలో ఉన్నట్లు వివరించారు. జిల్లాలో రైతు రుణమాఫీ ద్వారా ఈ ఆర్థ్ధిక సం వత్సరం మొదటి విడుతగా 14,600  మంది రైతులకు రూ.18 కోట్ల 27లక్షల రుణాలు మా ఫీ చేశామన్నారు. యాదవులకు గొర్రెల పెంప కం పథకం కింద ఇప్పటి వరకు 16, 800 మంది లబ్ధిదారులకు రూ.186 కోట్ల ఖర్చుతో 3,52,000  గొర్రె పిల్లలను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల,కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దీపికా యుగంధర్‌రావు, ఎమ్మెల్యేలు  గాదరి కిశోర్‌కుమార్‌, శానంపూడి సైదిరెడ్డి, అదనపు కలెక్టర్లు డి.సంజీవరెడ్డి, పద్మజారాణి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టె జానయ్యయాదవ్‌, సూర్యాపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌   శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.logo