ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 16, 2020 , 02:14:45

లోతట్టు ప్రాంతాలు జలమయం

లోతట్టు ప్రాంతాలు జలమయం

బొడ్రాయిబజార్‌ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు వీధుల్లో, ప్రధాన రహదారుల్లో నీరు నిలువగా వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడ్డారు. పాత మెయిన్‌రోడ్డుతో పాటు 60ఫీట్ల రోడ్డు బురదమయంగా మారింది. శివారు కాలనీల్లో నీరు నిలిచింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రియాంకకాలనీ, ఆర్‌.కె.గార్డెన్‌, కిశోర్‌ టాకీస్‌ వెనుక ప్రాంతాల్లో చేరగా మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశాలతో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ అధికారులతో వెళ్లి పరిశీలించారు. వర్షపు నీరు నిలువ ఉండకుండా జేసీబీతో ట్రెంచ్‌ కొట్టించారు.   logo