గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Aug 16, 2020 , 00:56:59

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం

వలిగొండ: సీఎం  సహాయ నిధి నిరుపేదలకు వరమని గోపరాజుపల్లి సర్పంచ్‌ కీసర్ల ఉపేంద్రాసత్తిరెడ్డి అన్నారు.మండల పరిధిలోని గోపరాజుపల్లికి చెందిన మేడి పావని, కట్టా లావణ్య అనారోగ్యాలతో బాధపడుతూ వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. మేడి పావనికి రూ.58 వేలు, కట్టా లావణ్యకు రూ.38 వేల చెక్కులను  శనివారం అందజేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, ఏనుగుల అయిలయ్య, సంగిశెట్టి చంద్రయ్య పాల్గొన్నారు. 


logo