శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 16, 2020 , 03:51:38

మూసీ పక్కన అంజన్న విగ్రహం

మూసీ పక్కన అంజన్న విగ్రహం

వలిగొండ        : మండలంలోని సంగెం మూసీ నది కాల్వ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆంజనేయస్వామి విగ్రహాన్ని వదిలి వెళ్లారు. ఈ అంశం శనివారం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంజనేయస్వామి విగ్రహం ఉన్న ప్రదేశాన్ని  సర్పంచ్‌ కీసరి రాంరెడ్డి, ఎస్సై శివనాగప్రసాద్‌ సందర్శించారు. గుర్తు తెలియని వ్యక్తులు పూజలు నిర్వహించి నది సమీపంలో వదిలి వెళ్లి ఉంటారని, ఇత్తడి లోహంతో చేసిన విగ్రహం సుమారు నాలుగు కిలోల బరువు ఉంటుందన్నారు. ఈ విగ్రహాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయానికి తరలించారు.


logo