సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 14, 2020 , 03:45:20

రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

  • విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 

శాలిగౌరారం : రైతును రాజు చేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుకు పోతున్నారని, వ్యవసాయం దండుగ అన్నోళ్లు పండుగ అనే రోజులు వచ్చాయని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార మహోత్సవానికి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీళ్లు లేక ఆకాశం వైపు ఎదురుచూసిన రైతాంగానికి నేడు సాగునీరు వద్దు అనేలా కేవలం ఆరేళ్ల పాలనలో చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. 2014కు ముందు రాష్ట్రంలో ఆకలిచావులు, రైతుల ఆత్మహత్యలు తప్ప అభివృద్ధి లేదన్నారు.

నేడు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.  ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ మాట్లాడుతూ.. నకిరేకల్‌ మార్కెట్‌కు గుండెకాయ లాంటి శాలిగౌరారం మండలాన్ని విభజించి నేడు నూతన వ్యవసాయ మార్కెట్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ఎంత కష్టమైనా భరిస్తుందన్నారు. నూతనంగా ఏర్పడిన పాలకవర్గం రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ వారికి ఎలాంటి లోటు రాకుండా చూడాలన్నారు. అనంతరం నూతన పాలక వక్గం సభ్యులచేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌కు నూతన చైర్మన్‌ కట్టా లక్ష్మీవెంకట్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ గంట లక్ష్మమ్మ, జడ్పీటీసీ ఎర్ర రణీలాయాదగిరి, వైస్‌ ఎంపీపీ కందుల అనితాఅర్లారెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గుజిలాల్‌ శేఖర్‌బాబు, పీఏసీఎస్‌ చైర్మన్‌ తాళ్లూరి మురళి, రైతుబంధు మండల కో ఆర్డినేటర్‌ గుండా శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్‌, చాడ హతీశ్‌రెడ్డి, శానాల యుగంధర్‌రెడ్డి, జెర్రిపోతుల చంద్రమౌళిగౌడ్‌, హరితవీరబాబు, బోడ నర్సయ్య, కొత్త శంకర్‌రెడ్డి, ఏమిరెడ్డి నర్సిరెడ్డి, కున్‌రెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, కట్టా పెదవెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు


logo