శనివారం 26 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 14, 2020 , 03:45:25

పల్లె ప్రకృతి వనం పనులు అడ్డుకున్న ఆరుగురిపై కేసు నమోదు

పల్లె ప్రకృతి వనం పనులు అడ్డుకున్న ఆరుగురిపై కేసు నమోదు

మునుగోడు : మండలంలోని చల్మెడ ఢీగామంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు అడ్డుతగిలి, అధికారులను దుర్భాషలాడిన ఆరుగురిపై  కేసు నమోదు చేశారు. తాసిల్దార్‌ దేశ్యానాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చల్మెడలోని సర్వే నెంబర్‌ 159, 160లో 6.02 ఎకరాల భూమిని ఇండ్ల  కోసం రెవెన్యూ శాఖ కేటాయించింది. సదరు భూమిలో 20ఏళ్లుగా ఎవరూ ఇండ్లు  దీంతో ఆ స్థలాన్ని డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి కేటాయించారు. మరో ఎకరా భూమిని పల్లె ప్రకృతి వనానికి కేటాయించి గురువారం పనులు ప్రారంభించారు. ఆ భూమి తమదని  పల్లె ప్రకృతి వనం పనులను అడ్డుకున్నారు.  నచ్చజెప్పేందుకు వెళ్లిన తాసిల్దార్‌ దేశ్యానాయక్‌, రెవెన్యూ, పోలీసు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు. దీంతో  రజనీకర్‌ ఆరుగురిపై  నమోదు చేశారు. ఆయన వెంట ఆర్‌ఐ శ్రీనునాయక్‌, సర్వేయర్‌ వెంకటనర్సయ్య, వీఆర్‌ఓ చంద్రయ్య  ఉన్నారు.


logo