శనివారం 26 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 14, 2020 , 03:45:37

ఇన్నోవా బోల్తా.. ప్రయాణికులు క్షేమం

ఇన్నోవా బోల్తా.. ప్రయాణికులు క్షేమం

సూర్యాపేట సిటీ : పట్టణ కేంద్రంలోని 65వ జాతీయ రహదారిపై ఇన్నోవా అదుపు తప్పి  ఢీకొట్టి బోల్తా పడింది.ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఇన్నోవా దురాజ్‌పల్లి సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి  పడింది. దీంతో వాహనం ధ్వంసమైనప్పటికీ అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చేశారు. 


logo