శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 13, 2020 , 01:03:48

తుది పరీక్ష‌లు పేట దవాఖానలో

తుది పరీక్ష‌లు పేట దవాఖానలో

  • సూర్యాపేట దవాఖానలో ట్రూనాట్‌, సీబీనాట్‌ టెస్టులు
  • మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో అందుబాటులోకి.. 
  • రోజుకు 50కిపైనే టెస్టులు.. ఇప్పటికి 1542పూర్తి 
  • 359 మంది పాజిటివ్‌ వ్యక్తుల్లో 253 మంది డిశ్చార్జి
  • నిరంతర పర్యవేక్షణకు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌

కరోనా వైరస్‌ సోకినట్లు అనుమానం ఉన్నవారికి పీహెచ్‌సీలు, ఏరియా దవాఖానల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు నిర్వహిస్తుండగా.. లక్షణాలు ఉండీ అక్కడ నెగెటివ్‌ వస్తే కచ్చితమైన నిర్ధారణకు ట్రూనాట్‌, సీబీనాట్‌ టెస్టులు అవసరం. ఈ పరీక్షలను సూర్యాపేటలోని జనరల్‌ దవాఖానలో చేస్తున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో రూ.1.30కోట్లతో పరికరాలను తెప్పించి.. ఐసొలేషన్‌ వార్డులు ఏర్పాటు చేసి బాధితులకు కార్పొరేట్‌ స్థాయిలో చికిత్స అందిస్తున్నారు. సకల సౌకర్యాలతో పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సిలిండర్లతోపాటు బలవర్థకమైన ఆహారం, మందులు అందజేస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. జూలై 23నుంచి ఇక్కడ 1542మందికి ట్రూనాట్‌, సీబీనాట్‌ టెస్టులు చేయగా.. 359మందికి పాజిటివ్‌ వచ్చింది. చికిత్స అనంతరం 252మందిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం 62మంది చికిత్స పొందుతున్నారు. 

 -సూర్యాపేట, నమస్తే తెలంగాణ 


సూర్యాపేట, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నవారికి జిల్లావ్యాప్తంగా పీహెచ్‌సీలు, ఏరియా దవాఖానల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చి కూడా వ్యాధి లక్షణాలు ఉంటే కచ్చితమైన నిర్ధారణ కోసం సూర్యాపేట జిల్లా ప్రభుత్వ దవాఖానలో ట్రూ నాట్‌, సీబీ నాట్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే   ఇలాంటి టెస్టులు ఎక్కడా లేకపోవడంతో మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.1.30 కోట్లు వె చ్చించి జిల్లా దవాఖానకు పరికరాలు తెప్పించారు. జూలై 23నుంచి ఇక్కడ ట్రూనాట్‌, సీబీనాట్‌ పరీక్షలు చేస్తుండగా ఇప్పటివరకు 1542 నిర్వహించారు. వీటిలో 359పాజిటివ్‌ రాగా 252మంది డిశ్ఛార్జి అయ్యారు.. 106మంది హైదరాబాద్‌కు వెళ్లగా మిగిలిన వారు దవాఖానలోనే చికిత్స పొం దుతున్నారు. కరోనా వైరస్‌ గుర్తించేందుకు  ఈ టెస్టు ద్వారా కచ్చితమైన నిర్ధారణతోపాటు వైరస్‌ లోడ్‌ ఏస్థాయిలో ఉందనేది కూడా తెలుస్తుంది. ఇదిలాఉండగా కరోనా చికిత్స చేస్తున్న గదుల్లో కార్పొరేట్‌ స్థాయిలో ఆక్సీజన్‌ సిలిండర్లు, బెడ్స్‌, బలవర్థకమైన ఆహారం, మం దులు అందిస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌రూం ఏ ర్పాటు చేశారు

ఉమ్మడిజిల్లా ప్రజలకు ఎలాంటి సమస్య రా కుండా అన్నీతానై ముందుండి నడిపిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి కరోనా విషయంలోనూ విశేష సేవలందిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి చెందుతున్న తొలినాళ్లలో సూర్యాపేటలో మర్కజ్‌ కేసు రావడంతో మంత్రి ఆదేశాలతో మర్కజ్‌ వ్యక్తితోపాటు ఆయన ప్రైమరీ కాంటాక్ట్‌లే కాకుండా సెకండరీ, మూడు, నాలుగో కాంటాక్ట్‌ వరకు శాంపిళ్లు తీసుకొని దాదాపు 1500 టెస్టులు హైదరాబాద్‌ పంపించి చేయించడంతో 83పాజిటివ్‌ కేసులతో కట్టడయ్యింది. అంతేకాక సూర్యాపేటలో ఏర్పాటుచేసిన ఐసొలేషన్‌ సెంటర్ల వద్దకు నేరుగా మంత్రి వెళ్లి అక్కడ చి కిత్స పొందుతున్న వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. తదనంతరం ఇతరప్రాంతాల నుంచి కొత్తగా కేసులు రావడం... గ్రామీణ ప్రాంతాలకు కూడా వైరస్‌ సోకడంతో ప్రభుత్వం చికిత్సలపై దృష్టి సారించింది. జనరల్‌, ఏరియా దవాఖానలతోపాటు పీహెచ్‌సీల్లో సైతం రెండు నిమిషాల్లో ఫలితం వచ్చే ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేస్తున్నారు. అయితే ఈ టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చినప్పటికీ కొంతమందికి లక్షణాలు ఉంటుండడంతో వాటి నిర్ధారణ కోసం ట్రూ నాట్‌, సీబీ నాట్‌ టెస్టులు చేపట్టేందుకు శాంపిల్‌ తీసి హైదరాబాద్‌కు తరలించేవారు. సూర్యాపేటలో మెడికల్‌ కళాశాల, జనరల్‌ దవాఖాన ఉన్నందున ట్రూ నాట్‌, సీబీ నాట్‌ టెస్టులు చేసే పరికరాలను తెస్తే కరోనానే కాదు తదనంతరం కూడా వైరల్‌ టెస్టులకు ఉపయోగపడుతుందని భావించిన మంత్రి రూ.1.30 కోట్లు వెచ్చించి కొనుగోలు చేయించారు.

1542 టెస్టులు పూర్తి 

ట్రూ నాట్‌, సీబీ నాట్‌ టెస్టులు ప్రారంభమైన నాటినుంచి జిల్లావ్యాప్తంగా రాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేసినా లక్షణాలు ఉన్న 1,542 మందికి సూర్యాపేట జనరల్‌ దవాఖానలో పరీక్షలు చేశారు. వీరిలో 359మందికి పాజిటివ్‌ రాగా 252 మంది సూర్యాపేటలోనే చికిత్స పొంది డిశ్చార్జి కాగా మరో 62మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 105మంది మాత్రం చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. 

కార్పొరేట్‌ స్థాయి చికిత్స 

సూర్యాపేట దవాఖానలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు సదుపాయాల కల్పనే కాదు...   దాదాపు 15మంది డాక్టర్లు ఏమాత్రం వెనకడుగు వేయకుండా నిరంతర చికిత్స అందిస్తున్నారు. దవాఖాన ఆవరణలోనే కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా కరోనా వార్డులు, శాంపిల్స్‌ సేకరణ, ఆహారం అందించే గదులు, డాక్టర్ల రౌండ్లు అన్నీ చూస్తుండగా ఎవరూ ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకు అ న్నింటినీ రికార్డు చేస్తున్నారు. అలాగే 30 ఐసీయూ బెడ్లు, 50 ఐసొలేషన్‌ బెడ్లు మొత్తం సెంట్రల్‌ ఆక్సీజన్‌ కనెక్షన్లతో ఉన్నాయి. దవాఖానలో పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు, శానిటైజర్లు, సోడి యం హైపోక్లోరైట్‌ ద్రావణం, రెమిడిసివిర్‌ ఇంజక్షన్లు, యాంటీ వైరస్‌ టాబ్లెట్లు ఇలా ప్రతిఒక్కటీ అందుబాటులో ఉన్నాయని డాక్టర్లు తెలిపారు.  

లక్షణాలుంటే వెంటనే రావాలి


  కొవిడ్‌-19 లక్షణాలు ఏమాత్రం అనిపించినా వెంటనే వచ్చి టెస్టు చేయించుకోవాలి. ప్రధానంగా లక్షణాలు కనపడగానే విపరీతంగా భయపడుతున్నారు.. దీంతో రోగనిరోధక శక్తి తగ్గుతుందని గ్రహించాలి. లక్షలాది మంది వైరస్‌ బారినపడి జయిస్తున్నారని గుర్తించాలి. జిల్లా దవాఖానలో కొవిడ్‌ బాధితుల కోసం  సకల సౌకర్యాలతోపాటు డాక్టర్లు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రస్తుతం ఐసీయూ, ఐసొలేషన్‌కు కలిపి 80బెడ్లు ఉండగా మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో త్వరలోనే మరో 150బెడ్లు రాబోతున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా ఆక్సిజన్‌ సరఫరా కోసం ట్యాంకు ఏర్పాటు జరుగుతోంది.  

  - డాక్టర్‌ దండ మురళీధర్‌రెడ్డి, దవాఖాన సూపరింటెండెంట్‌, సూర్యాపేట


logo