శనివారం 26 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 12, 2020 , 02:40:14

తుప్పు పట్టి.. తుక్కైపోయి...

తుప్పు పట్టి.. తుక్కైపోయి...

సూర్యాపేట సిటీ : వివిధ కేసుల్లో సీజ్‌ చేసిన వాహనాలు పోలీస్‌స్టేషన్లలో  పట్టి పోతున్నాయి.  ఎండకెండుతూ వానకు తడుస్తూ తుక్కుగా మారుతున్నాయి.  విలువ చేసే వాహనాలు ఎందుకూ పనికిరాకుండా పోతున్న పరిస్థితి.  జిల్లాలోని 25 స్టేషన్ల  వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటిని స్టేషన్‌ ఆవరణలో  రక్షణ లేకుండా  ఉంచడంతో  రాకుండా  గతంలో పట్టుబడిన వాహనాలకు  కోర్టు దృష్టిలో ఉంచి మెజిస్ట్రేట్‌ ఆదేశాల ప్రకారం వేలం వేసేవారు. దీంతో స్టేషన్లకు ఆదాయం రావడంతోపాటు  వినియోగం ఉండేది. అయితే.. కొన్ని సంవత్సరాలుగా వాహనాల వేలం వేయకపోవడంతో స్టేషన్‌ ఆవరణలోనే పాడై పోతున్నాయి.

ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన, పలు నేరాలకు సంబంధించిన కేసుల్లో ట్రాఫిక్‌, శాంతిభద్రతల పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకుంటారు.  మేరకు వాహనదారుడు తిరిగి తీసుకునేందుకు అవకాశముంటుంది. అయితే.. కొంతమంది అవగాహన లేక అలాగే వదిలేస్తున్నారు. ఇందులో కొన్ని కోర్టు తీర్పులతో  ఉంటాయి. కొన్నింటిలో కోర్టు తీర్పు రావడానికి చాలా సంవత్సరాలు పట్టడంతో  అప్పటికే  పడుతున్నాయి.  తీసుకెళ్లేందుకు   చూపకపోవడంతో అలాగే ఉండిపోతున్నాయి. ఇటువంటివి జిల్లాలోని అన్ని స్టేషన్ల  భారీగా పేరుకుపోయాయి. 

స్టేషన్‌లో ఉన్న వాహనాలు..

రోడ్లపై  గుర్తు తెలియని వాహనాలు. ఇలాంటి వాటిని పోలీస్‌స్టేషన్‌ను తరలిస్తారు. తన వాహనం పోయిందని వాహనదారుడు ఫిర్యాదు చేస్తే విచారించి అప్పగిస్తారు.  వాహనాలు,  కేసుల్లో స్వాధీనం చేసుకున్నవి.ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడినవి..  తీర్పుతో ముడిపడి ఉన్న వాహనాలు పోలీస్‌స్టేషన్లలో మూలకుపడి ఉంటున్నాయి. 

యజమానికి చేరేదెలా..?

వివిధ సందర్భాల్లో పట్టుబడిన వాహనాలను ఎలా విడిపించుకోవాలో తెలియక  తమ వాహనాలను అలాగే వదిలేస్తున్నారు. ప్రమాదాల్లో పాడైన వాహనాలను కొంత మంది వదిలిపెడుతుంటారు. కోర్టు తీర్పుతో ముడిపడిన వాహనాలు.. రిలీజ్‌ ఆర్డర్‌ కాపీ యజమానులకు చేరకపోవడం ద్వారా వాహనాలను పొందలేకపోతున్నారు.  మారడం  కారణాలతో  యజమానులకు చేరకుండా పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోనే ఉండిపోతున్నాయి. పోలీసులు, కోర్టు సిబ్బంది చొరవ తీసుకొని వాహనాలను యజమానులకు అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.  ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. 


logo