బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Aug 11, 2020 , 01:55:13

టీఆర్‌ఎస్‌ పాలన.. దేశానికే ఆదర్శం

టీఆర్‌ఎస్‌ పాలన..  దేశానికే ఆదర్శం

  • l ప్రశాంతత కల్పించినం.. అభివృద్ధి సాధించినం
  • l భయాందోళనలు వీడి అంతా ధైర్యంగా బతుకుతుండ్రు..
  • l 60 ఏళ్ల నిర్లక్ష్యాన్ని ఎండగట్టి ఎన్నో  సంచనాలు సృష్టించినం..
  • l విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి
  • l కాంగ్రెస్‌, బీజేపీల నుంచి 160 మంది  టీఆర్‌ఎస్‌లో చేరిక

పోరాడి సాధించిన తెలంగాణలో 60 ఏళ్ల ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో కేవలం ఆరేళ్లలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, నేడు దేశానికే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూర్‌(ఎస్‌) మండలం తుమ్మల పెన్‌పహాడ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎంపీటీసీతోపాటు కాంగ్రెస్‌, బీజేపీల నుంచి 160 మంది మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరేళ్లుగా కొట్లాటలకు స్వస్తి చెప్పి ప్రజలందరికీ ప్రశాంతత కల్పించామని.. అందువల్లే ఎంతో అభివృద్ధి సాధించగలిగామన్నారు. 

సూర్యాపేట టౌన్‌ : 60ఏండ్ల ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టి పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో కేవలం ఆరేళ్లలోనే సరికొత్త రికార్డులు సృష్టించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.  సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూర్‌.ఎస్‌ మండలం తుమ్మలపెన్‌పహాడ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎంపీటీసీ ఉప్పల మల్లయ్యతోపాటు కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన సుమారు 160మంది నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరగా,

వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. పోరాడి సాధించిన తెలంగాణలో గత ఆరేళ్లుగా గొడవలు, కొట్లాటలకు స్వస్తి పలికి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలందరికీ ప్రశాంతత కల్పించాము. దీంతో ప్రజల్లో భయాందోళనలు అంతరించి ఎవరి పనులు వారు ధీమాగా చేసుకుంటూ ధైర్యంగా బతుకుతున్నారన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటూ టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నో సంచలనాలు సృష్టించిందన్నారు. పార్టీలో కొత్త, పాత తేడా లేకుండా అంతా కలిసికట్టుగా నిరంతరం ప్రజాభివృద్ధికి పాటుపడాలన్నారు. ఉమ్మడి పాలనలో ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు, ప్రజలను కేవలం పంచాయతీలు, కొట్లాటలతో కేసుల పాలు చేసి పోలీస్‌స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పి స్వప్రయోజనాలకు వాడుకున్నారే తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు.

కానీ అధికారం చేపట్టిన ఆరేండ్లలోనే ఎవరూ ఊహించని రీతిలో  అభివృద్ధి సాధించి సంచలనాత్మకమైన పాలనకు కేరాఫ్‌గా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిలిచిందన్నారు.  కరోనా కష్టకాలంలోనూ ప్రజలను అన్నివిధాలుగా ఆదుకుంటూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను  కొనసాగిస్తూ అన్నిరంగాల ప్రజల్లో మరింత ధైర్యాన్ని నింపి వారి అభిమానాన్ని మరింత చూరగొంటున్నామన్నారు. జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారిలో మాజీ ఉప సర్పంచ్‌ ఎర్రోజు ఎల్లాచారి, వట్టికూటి సైదులు, పిట్టల చంద్రయ్య, వెంకన్న, శ్రీకాంత్‌, రమేశ్‌తోపాటు 160మంది ఉన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, జడ్పీటీసీ జీడి భిక్షం, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొణతం సత్యనారాయణరెడ్డి, వైస్‌ చైర్మన్‌ బొల్లె జానయ్య, నాయకులు తూడి నర్సింహారావు, కసగాని బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.    


logo